ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకలి కడుపులకు ఏబీఎన్ రిపోర్టర్ ఆసరా..

ABN, First Publish Date - 2020-03-30T03:15:02+05:30

ప్రజలకు, ప్రభుత్వానికి వారధి మీడియా. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేయడంలోనూ, ప్రభుత్వానికి లోటుపాట్లను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్గంపేట(తూర్పు గోదావరి జిల్లా): ప్రజలకు, ప్రభుత్వానికి వారధి మీడియా. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేయడంలోనూ, ప్రభుత్వానికి లోటుపాట్లను ఎత్తిచూపడంలోనూ మీడియా పాత్ర కీలకమైంది. అలాంటి బాధ్యత కలిగిన మీడియాగా కష్టకాలంలో సమాజానికి సాయం చేయడంలోనూ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థలు ఎల్లప్పుడూ ముందుంటాయి. సంస్థ మాత్రమే కాదు ఉద్యోగులదీ అదే బాట. తూర్పు గోదావరి జిల్లాలో ఏబీఎన్ రిపోర్టర్ చూపిన ఉదారమే ఇందుకు ఉదాహరణ. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్ల మీదకు రాకపోవడంతో యాచకుల పరిస్థితి దయనీయంగా మారింది. మామూలు రోజుల్లో జనం ఇచ్చే చిల్లరతో ఆహారం కొనుక్కుని కడుపు నింపుకునే యాచకులు ఇప్పుడు ఖాళీ కడుపుతో ఆకలికి అలమటిస్తున్నారు. అలా అరుగుల మీద పడుకుని.. తినేందుకు తిండి లేక అలమటిస్తున్న కొందరు బిచ్చగాళ్లను జగ్గంపేట ఏబీఎన్ రిపోర్టర్ మానూరి గంగరాజు గమనించారు.


దూర ప్రాంతాల నుంచి ప్రయాణమై ఎటువంటి సౌకర్యం లేక రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ప్రయాణికులను కూడా ఆయన చూశారు. దీంతో.. యాచకులకు, ప్రయాణం చేస్తూ ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి ఏబీఎన్ రిపోర్టర్ మానూరి గంగరాజు భోజనం అందించారు. కరోనా రక్కసి కల్లోలం సృష్టిస్తున్న ఈ కష్టకాలంలో పిడికెడు మెతుకులు కరువైన వారికి భోజనం పెట్టించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.

Updated Date - 2020-03-30T03:15:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising