ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాలకు అనుసంధానం చేయొద్దు

ABN, First Publish Date - 2020-11-03T05:48:17+05:30

సచివాలయాలకు తమ సేవలను అనుసంధానం చేయరాదని కోరుతూ ఆశా వర్కర్లు సోమవారం కలెక్టరేట్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌ వద్ద ఆశా వర్కర్ల ధర్నా
డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), నవంబరు 2: సచివాలయాలకు తమ సేవలను అనుసంధానం చేయరాదని కోరుతూ ఆశా వర్కర్లు సోమవారం కలెక్టరేట్‌ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. , బెనిఫిట్స్‌ కల్పించిన తర్వాతే రిటైర్మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  ఆశ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ సీహెచ్‌సీ సిబ్బంది, సచివాలయం ఏఎన్‌ఎంలు పొంతన లేకుండా పని అప్పగిస్తున్నారని, మున్సిపల్‌ అధికారుల బెదిరింపులతో భయందోళనలకు గురవుతున్నామన్నారు. ఆశ వర్కర్లను సచివాలయాలకు కేటాయించే ప్రక్రియను తక్షణం ఆపాలన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ కరోనా వారియర్స్‌గా పని చేసి మరణించిన ఆశా వర్కర్ల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. కార్మిక వ్యతిరేక కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ గౌరీశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు కె.కృష్ణవేణి, ఆశ వర్కర్ల అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు కె.అన్నామణి, సీఐటీయూ నాయకురాలు ఎస్‌కె పద్మ, వెంకటలక్ష్మి, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-11-03T05:48:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising