ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రొయ్యల సాగుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి

ABN, First Publish Date - 2020-09-24T08:01:43+05:30

రొయ్యల సాగుపై పూర్తిస్థాయి విచారణచేసి నివేదిక ఇవ్వాలని ఎఫ్‌డీవో వి.డేవిడ్‌రాజును సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లవరం, సెప్టెంబరు 23: రొయ్యల సాగుపై పూర్తిస్థాయి విచారణచేసి నివేదిక ఇవ్వాలని ఎఫ్‌డీవో వి.డేవిడ్‌రాజును సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ ఆదేశించారు. గుండెపూడిలో భూపతి మణిరాజు, నూలు సూర్యప్రభాకరావు, నూలు బులిసత్తిరాజు, నూలు శ్రీనివాస్‌లు చేపలసాగుకు అనుమతి తీసుకుని చెరువులు తవ్వి రొయ్యలసాగు చేస్తూ ఉప్పునీటిని పంటబోదెలోకి వదిలేస్తున్నారని మాజీ సర్పంచ్‌ కొపనాతి వెంకటేశ్వరరావు, గోవిందరావు, కొపనాతి  ఆదినారాయణ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బుధవారం దీనిపై విచారణ చేసేందుకు గుండెపూడిలోని ఆక్వా చెరువులను సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ బుధవారం పరిశీలించారు.


ఈచెరువుల సాగుపై ఏం చర్యలు తీసుకున్నారని ఎఫ్‌డీవోను సబ్‌కలెక్టర్‌ ప్రశ్నించారు. పూర్తిస్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బోడసకుర్రు వంతెన వద్ద లేఅవుట్‌లో 18సెంట్ల భూమిని పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఈవోపీఆర్డీ ఏపీఎల్‌ నరసింహం, వైసీపీ నాయకులు దొమ్మేటి శ్యాంప్రకాష్‌, చింతా బాబి, అడపా శ్రీనివాసరావు, అంబటి శ్రీను, సీహెచ్‌. రాజేష్‌, డిప్యూటీ తహశీల్దార్‌ ఎస్‌వీవీ.సత్యనారాయణ, ఆర్‌ఐ ఎం.దుర్గా శ్రీనివాస్‌, ఎస్‌ఐ బి.ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-24T08:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising