ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణ లక్ష్యం రూ. 9,341.62 కోట్లు

ABN, First Publish Date - 2020-06-18T10:20:49+05:30

నిర్వహించిన జిల్లా వార్షిక ప్రణాళిక సమీక్షలో అధికారికంగా ప్రకటిం చారు. దీంతో 2020-21 వార్షిక ప్రణాళిక మొత్తం రూ.27 వేల కోట్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

2020-21 జిల్లా వార్షిక ప్రణాళికలో సాగుకు ప్రాధాన్యం

5.59  లక్షల మంది రైతులకు ఈ ఖరీఫ్‌లో పంట రుణాలు 

అనుబంధ రంగాల్లో 3.12 లక్షల రైతులకు టర్మ్‌ రుణాలుగా రూ. 5,625.93 కోట్ల కేటాయింపులు


 (కాకినాడ- ఆంధ్రజ్యోతి):  నిర్వహించిన జిల్లా వార్షిక ప్రణాళిక సమీక్షలో అధికారికంగా ప్రకటిం చారు. దీంతో  2020-21 వార్షిక ప్రణాళిక మొత్తం రూ.27 వేల కోట్లలో  సాగుకు పెద్దపీట వేశారు. దీంతో 5.59 లక్షల మంది రైతులకు పంట రుణాలు, అనుబంధ రంగాల్లో 3.12 లక్షల రైతులకు టర్మ్‌ రుణాలుగా రూ.5,625.93 కోట్లు కేటాయించారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైంది. వర్షాలు కూడా జిల్లా అంతటా కురుస్తున్నాయి. దీంతో రైతులు నారుమడి సిద్ధం చేస్తున్నారు. కొందరు దుక్కులు ప్రారంభించారు. త్వరలో నారుమళ్లు వేయడానికి సమాయత్తమవుతున్నారు. రుణ లక్ష్యాన్ని సాధించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. అయితే బ్యాంకర్లు సహకరించపోతే ఇబ్బందుల పాలవుతామని, అటువంటివి లేకుండా ఇప్పటికే కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి బ్యాంకర్లతో సమీక్షించారు.


రైతులు ఏటా పంట పెట్టుబడు లకు రుణాల కోసం ప్రాథమిక సహకార సంఘాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కొందరికి సకాలంలో, మరికొందరికి ఆలస్యంగా రుణాలు అందుతున్నాయి. ఈసారి గత సీజన్‌ల కంటే ఎక్కువ మొత్తంలో రుణాలిచ్చేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతుంది. పంట రుణాలకు అనుబంధంగా ఎద్దుల బళ్లు, మేకలు, ఇతర పశువుల కొనుగోలు లాంటి దీర్ఘకాలిక రుణాల విషయంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో బ్యాంకులు, సహకార సంఘాలపై నమ్మకం సన్నగిల్లుతున్న రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అటువంటివి లేకుండా ఈసారి దీర్ఘకాలిక రుణాలు కూడా సక్రమంగా ఇప్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరు తున్నారు. ఈ సీజన్‌ నుంచి కౌలు రైతులకు పంట పెట్టుబడి విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది. వీరికి రుణాలు సకాలంలో అందకపోవడం వల్ల అప్పులు చేస్తున్నారు. గతంలో కౌలు రైతు గుర్తింపు కార్డులిచ్చి, వారికి సాగు ధ్రువీ కరణ పత్రాలు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఇచ్చేవారు. దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ప్రత్యేక చట్టం ద్వారా పంట సాగుహక్కు పత్రాలు ఇవ్వడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పత్రాలు వీరికి అందాలంటే భూయజమాని అంగీకారం కావాలి. అలాగే సంబంధిత పత్రంపై వీరు సంతకం చేయాలి. ఈ విషయంలో అధిక శాతం భూయజమానులు ఒప్పుకోవడం లేదు.


కానీ క్షేత్ర స్థాయిలో కౌలు రైతులు, భూ యజమానుల మధ్య ఉన్న సమస్యలను గుర్తించి అర్హులందరికీ రుణా లివ్వాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో ఉన్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రా ల సేవలు వినియోగించుకుని, కౌలు రైతులు రుణాలు పొందేలా యంత్రాంగం ఆదేశాలిచ్చింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో టర్మ్‌ రుణాల విషయంలో ఆయా శాఖలు దృష్టి సారిస్తున్నాయి.

Updated Date - 2020-06-18T10:20:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising