7 నుంచి స్కవర్ స్లూయిస్ ఫ్లషింగ్ ఆపరేషన
ABN, First Publish Date - 2020-11-03T07:06:05+05:30
ఈనెల7న పశ్చిమ డెల్టా, 8న మధ్య డెల్టా, 9న తూర్పు డెల్టాల్లో స్కవర్ స్లూయిస్‌ల్లో ఫ్లషింగ్ ఆపరేషన్ నిర్వహించనున్నట్టు హెడ్ వర్క్స్ ఈఈ ఆర్.మోహనరావు సోమవారం తెలిపారు.
ధవళేశ్వరం, నవంబరు 2: ఈనెల7న పశ్చిమ డెల్టా, 8న మధ్య డెల్టా, 9న తూర్పు డెల్టాల్లో స్కవర్ స్లూయిస్‌ల్లో ఫ్లషింగ్ ఆపరేషన్ నిర్వహించనున్నట్టు హెడ్ వర్క్స్ ఈఈ ఆర్.మోహనరావు సోమవారం తెలిపారు. వరదలకు డెల్టా హెడ్ స్లూయిస్ అప్రోచ్ కాలువల్లో పేరుకుపోయిన బురద, చెత్తాచెదారాన్ని తొలగించడానికి స్కవర్ స్లూయిస్‌ల్లో వున్న గేట్లను ఎత్తివేసి నిరంతరాయంగా నీటిని విడుదల చేస్తూ ఈ ప్రక్రియ నిర్వహిస్తారు.
Updated Date - 2020-11-03T07:06:05+05:30 IST