ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా మీదుగా 5 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

ABN, First Publish Date - 2020-05-31T10:03:14+05:30

సుదీర్ఘకాలం తర్వాత రైళ్ల రాకపోక లను జూన్‌ 1 నుంచి ప్రారంభించేందుకు రైల్వే శాఖ అన్ని సన్నాహాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 200 రైళ్లకు అనుమతులివ్వగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట, మే 30: సుదీర్ఘకాలం తర్వాత రైళ్ల రాకపోక లను జూన్‌ 1 నుంచి ప్రారంభించేందుకు రైల్వే శాఖ అన్ని సన్నాహాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 200 రైళ్లకు అనుమతులివ్వగా విజయవాడ డివిజన్‌లో సామర్లకోట మీదుగా విశాఖకు వెళ్లే రైళ్ల వివరాలను రైల్వే శాఖ ప్రకటిం చింది. హౌరా- సికింద్రాబాద్‌ మధ్య ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌ రైలు రోజూ నడుస్తుంది. ఈ రైలు విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, సామర్లకోటలలో ఆగి విశాఖ మీదుగా హౌరాకు చేరుతుంది. అలాగే హైదరాబాద్‌ - విశాఖ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు రోజూ నడవనుండగా విజయవాడ ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, నర్సీపట్నం రోడ్డు, యలమంచిలి, అనకాపల్లిలలో ఆగుతుంది. ఇక ముంబై -భువనేశ్వర్‌ మధ్య కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రాకపోకలు సాగి స్తుంది.


ఈ రైలు విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, పిఠాపురం, తుని అనకాపల్లి స్టేషన్లలో ఆగుతుంది. అలాగే విశాఖ- న్యూఢిల్లీ మధ్య ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రోజూ నడుస్తుంది. ఈ రైలు విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, అనకాపల్లి స్టేషన్లలో ఆగుతుంది. హౌరా- యశ్వంత్‌పూర్‌ల మధ్య దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఈ రైలు వారం లో అయిదు రోజులు విజయవాడ మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రైళ్లకు ఇప్పటికే 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో రిజర్వే షన్లు పూర్తయ్యాయి. శుక్రవారం సాయంత్రం నాటికి వెయిటింగ్‌ లిస్ట్‌ సంఖ్య అనూ హ్యంగా పెరిగింది. రిజర్వేషన్‌ చేయించుకున్నవారు మత్రమే గంటన్నర ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి. థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేశాకే ప్లాట్‌ఫాం పైకి అనుమతిస్తారు.


సాధారణ తరగతి సీట్లకు రిజర్వేషన్‌ 

ప్రత్యేక రైళ్లలో సాధారణ తరగతి బోగీలలోని సీట్లకు కూడా రిజర్వేషన్‌ తీసు కోవాల్సి ఉంటుంది. సీట్ల రిజర్వేషన్‌ ఉండే జనరల్‌ కోచ్‌లకు సీటింగ్‌ రుసుం వసూలు చేస్తారు. ఈ రైళ్ళలో రిజర్వేషన్‌ లేకుండా జనరల్‌ బోగీలేమీ ఉండవు. రైల్వే స్టేషన్‌లోనూ, ,రైళ్లలోనూ టిక్కెట్‌ తీసుకునే అవకాశం ఉండదు. అన్ని టిక్కెట్లు ఐఆర్‌సీటీసీ యాప్‌ ద్వారానే తీసుకోవాలి. కనీసం 30 రోజుల ముందుగా టిక్కెట్లు తీసుకునే అవకాశం ఉంది. తత్కాల్‌, ప్రీమియం తత్కాల్‌ టిక్కెట్లు ఉండవు. ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌ టిక్కెట్లు నిబంధనల ప్రకారం జారీ చేస్తారు.

Updated Date - 2020-05-31T10:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising