ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యాన్నదానానికి రూ.2 లక్షల విరాళం

ABN, First Publish Date - 2020-11-26T05:34:01+05:30

అన్నవరం, నవంబరు 25: అన్నవరం సత్యదేవుడి నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు దాతలు రూ.2 లక్షలు విరాళంగా సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే సోదరు

విరాళం అందజేస్తున్న పర్వత రాజబాబు దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, నవంబరు 25: అన్నవరం సత్యదేవుడి నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు దాతలు రూ.2 లక్షలు విరాళంగా సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే సోదరుడు, శంఖవరానికి చెందిన పర్వత గుర్రాజు దంపతులు రూ.లక్ష ఈవో త్రినాథరావుకు అందజేశారు. దీనిపై వచ్చే వడ్డీతో ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పర్వత సీతారత్నం, శ్రీరామ్మూర్తి పేరున అన్నదానం జరిపించాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన పాలూరి లక్ష్మణరావు రూ.1,00,116 విరాళంగా అందించారు.


రత్నగిరి పాలక మండలి అత్యవసర సమావేశం

అన్నవరం దేవస్థానంలో తెప్పోత్సవం, కార్తీకమాస పనులు, లీజుల విభాగానికి సంబంధించి 4అంశాల ఆమోదం కోసం బుధవారం పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించి ఆమోదించారు. గురువారం జరిగే తెప్పోత్సవం విద్యుత్‌దీప అలంకరణలకు సంబంధించి 2శాతం లెస్స్‌కు రూ.1,69,349, లోయిస్ట్‌ టెండర్‌కు ఆమోదించారు. ఆలయ ప్రాంగణంలో రూ.2.28,480కు వాటర్‌ప్రూఫ్‌ పెండాల్‌ పందిరి వేసేందుకు లోయెస్ట్‌ టెండర్‌కు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఆలయంలో భక్తులకు ఆవునెయ్యి దీపాలు విక్రయించేందుకు, వ్రత మండపాల్లో పోలరైడ్‌ ఫొటోలు లైసెన్స్‌ హక్కుకోసం హైయస్ట్‌ టెండర్‌ను ఆమోదించారు. సమావేశంలో చైర్మన్‌ ఐవీరోహిత్‌, ఈవో త్రినాథరావు, సభ్యులు వాసిరెడ్డి జమీ లు, మోకా భాస్కరరరావు,కర్రిబామిరెడ్డి జమిందారు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T05:34:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising