ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కో కుటుంబంపై లక్షపైనే!

ABN, First Publish Date - 2020-10-01T07:49:03+05:30

జగన్‌ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే రికార్డు స్థాయిలో అప్పులు చేసింది. ఇప్పటి వరకు అక్షరాలా రూ.1,30,000 కోట్ల రుణాలు తీసుకురాగా.. ఇంకా కొత్త అప్పుల కోసం ఆర్థిక శాఖ తీవ్రంగా శ్రమిస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఒక్కొక్కరిపై 26 వేల రుణభారం
  • 16 నెలల్లో రికార్డు స్థాయిలో అప్పులు

అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే రికార్డు స్థాయిలో అప్పులు చేసింది. ఇప్పటి వరకు అక్షరాలా రూ.1,30,000 కోట్ల రుణాలు తీసుకురాగా.. ఇంకా కొత్త అప్పుల కోసం ఆర్థిక శాఖ తీవ్రంగా శ్రమిస్తోంది.  రాష్ట్ర జనాభా 5 కోట్ల మందికీ ఈ అప్పులను సమానంగా పంచితే ఒక్కొక్కరిపై రూ.26,000 చొప్పున రుణభారం పడుతుంది. సగటున ఒక కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులుంటే ఆ కుటుంబంపై ఈ 16 నెలల్లో పడిన అప్పుల భారం అక్షరాలా రూ.1,04,000.


సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఈ 16 నెలల్లో సగటున రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పంచింది. పంచిన మొత్తంతో పోల్చితే.. పంచడం కోసం తెచ్చిన అప్పుల రూపంలో కుటుంబాలపై భారం ఎక్కువైంది. ప్రభుత్వ పథకాలకు అర్హులు కాని కుటుంబాలపై కూడా ఈ భారం పడుతుంది. ప్రభుత్వ చెల్లింపుల్లో మొదటి ప్రాధాన్యం అప్పుల తిరిగి చెల్లింపులు, వాటి వడ్డీలే. ఆర్‌బీఐ ఈ అప్పులు, వడ్డీలను మినహాయించుకున్నాకే మిగిలిన డబ్బును రాష్ట్ర ఖాతాకు బదిలీ చేస్తుంది. అంటే అప్పుల తర్వాతే ఏ ఖర్చయినా! ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు అయినా, అవ్వాతాతలకు వృద్ధాప్య పింఛన్లు అయినా,  నెలా నెలా ఇచ్చే రేషన్‌ సరుకులైనా అప్పులు, వడ్డీలు చెల్లించాక మిగిలిన డబ్బుతోనే ఇవ్వాల్సి ఉంటుందన్న మాట!


Updated Date - 2020-10-01T07:49:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising