ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టణ ప్రాంతాల్లో 691 అనధికార లేఅవుట్లు

ABN, First Publish Date - 2020-10-22T09:35:27+05:30

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 691 అనధికార లేఅవుట్లు ఉన్నాయని పట్టణ ప్రణాళికా విభాగం పరిశీలనలో నిర్ధారణ అయింది. పట్టణ స్థానిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్రమ నిర్మాణాల సంఖ్య 20,745గా నిర్ధారణ 

వాటి సర్టిఫికెట్లు సమర్పించండి: డీటీసీపీ 


అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 691 అనధికార లేఅవుట్లు ఉన్నాయని పట్టణ ప్రణాళికా విభాగం పరిశీలనలో నిర్ధారణ అయింది. పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో అక్రమ నిర్మాణాలు, అనధికార వెంచర్లను గుర్తించేందుకు ప్రభుత్వం ఇచ్చిన 15రోజుల గడువు సోమవారంతో ముగియగా, అప్పటికి 691 అక్రమ లేఅవుట్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాల సంఖ్య 20,745గా తేలింది. ఈ కట్టడాలు, లేఅవుట్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వార్డు ప్రణాళిక, క్రమబద్ధీకరణ కార్యదర్శులు తమ పరిధిలో గుర్తించిన వాటి వివరాలతో సర్టిఫికెట్లు వెంటనే సమర్పించాలని డీటీసీపీ వి.రాముడు ఆదేశించారు. గత 15రోజుల్లో గుర్తించి, ఆన్‌లైన్‌లో నమోదు చేసినవి కాకుండా తమ పరిధిలో మరే ఇతర అక్రమ నిర్మాణాలు, అనధికార వెంచర్లు లేవని వాటిల్లో పేర్కొనాలన్నారు. ఈ సర్టిఫికెట్లను యూఎల్‌బీల టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఉడాల్లో వైస్‌ ఛైర్మన్లు, ఏఎంఆర్డీయే, వీఎంఆర్డీయేల్లో ఆయా మెట్రోపాలిటన్‌ కమిషనర్లు నిర్ధారించి, మంగళవారమే తమకు ఆన్‌లైన్‌ ద్వారా పంపాలని కోరారు. 

Updated Date - 2020-10-22T09:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising