సచివాలయ సిబ్బందికి డ్రెస్‌కోడ్!
ABN, First Publish Date - 2020-11-11T09:15:07+05:30
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్ అమలులోకి తెచ్చింది. కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ ఆలోచన
విజయవాడ రూరల్, అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్ అమలులోకి తెచ్చింది. కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ ఆలోచన నుంచి పుట్టికొచ్చిన ఈ డ్రెస్‌కోడ్ విధానాన్ని తొలుత కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి-1, జక్కంపూడి-1 మోడల్ గ్రామ సచివాలయ ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. వారంలో ఒకసారి ఉద్యోగులంతా డ్రెస్ వేసుకుంటున్నారు. ఇందుకోసం స్కై బ్లూ కలర్ టాప్, బిస్కెట్ కలర్ లోయర్‌ను ఎంపిక చేసి పంపిణీ చేశారు. ఉద్యోగుల కేడర్‌ను బట్టి గుర్తింపు కార్డుల ట్యాగ్ కలర్‌లను కూడా ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. కాగా, డ్రెస్ కోడ్ విధానాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ అమలు చేయాలని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ నిర్ణయించారు. డ్రెస్‌కోడ్ అమలుపై త్వరలోనే ఇతర జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలనే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు వలంటీర్లకు కూడా డ్రస్‌కోడ్ అమలుచేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.
Updated Date - 2020-11-11T09:15:07+05:30 IST