ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 రాజధానులపై ప్రజాతీర్పు కోరదాం

ABN, First Publish Date - 2020-10-21T08:51:29+05:30

మూడు రాజధానుల అంశంపై వైసీపీకి దమ్ముంటే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని మొత్తం ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరడానికి ముందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలందరం రాజీనామా చేద్దాం

దమ్ముంటే వైసీపీ రావాలి: అచ్చెన్న

అధికార పార్టీకి అచ్చెన్నాయుడి సవాల్‌

కోర్టులపై నింద వేయడానికే జగన్‌ లేఖాస్త్రాలు

ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ప్రత్యేక చర్చలో టీడీపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడు


అమరావతి/కోటబొమ్మాళి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల అంశంపై వైసీపీకి దమ్ముంటే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోని మొత్తం ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరడానికి ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. కనీసం ఉత్తరాంధ్రలో అయినా ఆ పార్టీకి ప్రజల మద్దతు లభిస్తే ఈ అంశంపై పోరాటం విరమించాలని తమ పార్టీ నాయకత్వాన్ని కోరతామని తెలిపారు. టీడీపీకి నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఆయన ఆయన మంగళవారం సాయంత్రం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ప్రత్యేక చర్చలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో విలేకరులతోనూ మాట్లాడారు. ‘అమరావతే మా రాజధాని అని గత ఎన్నికల్లో మేం పోటీ చేశాం. ఉత్తరాంధ్రలో టీడీపీ నుంచి ఆరుగురం గెలిచాం. వైసీపీ కూడా ఆ ఎన్నికల్లో అమరావతే రాజధాని అని చెప్పింది. మాట మార్చినందుకు లెక్క ప్రకారం వారు మాత్రమే రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలి. అయినా సరే మీరూ, మేమూ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలందరం రాజీనామా చేసి మళ్లీ ప్రజల ముందుకు వెళ్దాం. వారు ఏం తీర్పు ఇస్తారో చూద్దాం.


ఆ దమ్ము లేకపోతే ఇక రాజీనామాల మాట మాట్లాడడం మానేయండి’ అని వైసీపీ నేతలకు హితవు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు సాధించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు. ‘గతంలో వైసీపీకి సర్వే చేసిన వారే ఇప్పుడు కొత్తగా సర్వే చేసి టీడీపీకి 8-10 శాతం ఓటింగ్‌ పెరిగిందని చెబుతున్నారు. ఊరూరా ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు కత్తిరిస్తారేమోనన్న భయంతో ఇప్పుడు రోడ్డు పైకి రాకపోవచ్చునేమో గాని.. ఎన్నికలు వస్తే ఖాయంగా తమ తీర్పు ఇస్తారు. దళితులు వైసీపీకి పెద్ద ఓటు బ్యాంకు. జగన్‌ అధికారంలోకి వచ్చేవరకూ వారు ఆయనను బాగా నమ్మారు. తీరా అధికారంలోకి వచ్చాక.. దేశంలో ఎక్కడా లేనంతగా దాడులకు గురవుతోంది వారే. జగన్‌ ఏమిటో వారికే బాగా అర్థమైంది. వారిలో కూడా మార్పు వస్తోంది’ అని చెప్పారు. టీడీపీకి మొదటి నుంచి బాగా అండగా ఉన్న బీసీ వర్గాల్లో పోయిన ఎన్నికల్లో కొంత విభజన వచ్చిందని, జగన్‌ చెప్పిన మోసపు మాటలు నమ్మి వారిలో కొంత మంది ఆ పార్టీకి ఓటేశారని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించిన అనేక పథకాలు నిలిచిపోవడం, అడుగడుగునా తొక్కివేయడంతో వారికి నిజ స్వరూపం తెలిసిందని... ఇప్పుడు మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపిస్తు


స్తబ్ధత పోగొడతా..

‘తప్పుడు కేసులు, ఆర్థిక మూలాలపై దెబ్బ తీయడం వంటి పనులతో కొందరు టీడీపీ నేతల్లో కొంత భయం ఏర్పడిన మాట వాస్తవం. వారు స్తబ్ధుగా ఉండడంతో పార్టీ కేడర్‌లో కూడా కొంత అయోమయం నెలకొంది. ఆ స్తబ్ధత పోగొట్టడానికి నేను ముందుండి పనిచేస్తాను. ఒకసారి నాయకులు రోడ్డుపైకి వచ్చి నిలబడితే వారి వెనుక శ్రేణులు కూడా వస్తాయి. ప్రజల్లో రాజకీయపరంగా వస్తున్న మార్పు కూడా నేతల్లో భయం తగ్గిస్తోంది. జగన్‌ రెడ్డి పదహారు అవినీతి కేసుల్లో మొదటి నిందితుడు. రూ.43 వేల కోట్ల మేర రాష్ట్ర సంపదను దోచేశాడని ఆస్తులను ఈడీ జప్తు చేసింది. లక్ష కోట్లు దోచుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు. అటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తూ మమ్మల్ని విమర్శించడానికి వైసీపీ నేతలకు ఉన్న నైతిక హక్కేమిటి? జగన్‌ పత్రిక నాపై పుంఖానుపుంఖాలుగా రాస్తోంది. నాపై అవినీతి ఆరోపణలు చేస్తోంది. నేను ఒక లేఖ ఇచ్చానని నాపై ఏసీబీతో కేసు పెట్టించారు. కానీ నేను ఏ రకమైన లావాదేవీలు నడిపినట్లు ఆధారాలు లభించలేదని దర్యాప్తు అధికారి బహిరంగంగా మీడియా ముందు చెప్పారు. అదే విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదులు కూడా కోర్టుకు చెప్పారు. ఇన్ని కేసులు ఉండి 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి కూడా సీఎం కాగలిగాడు. భారత ప్రజాస్వామ్యానికి నా నమస్కారం.’

Updated Date - 2020-10-21T08:51:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising