ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదిగో ఇంటి పట్టా!

ABN, First Publish Date - 2020-12-25T08:48:30+05:30

రుపేదలను సుదీర్ఘకాలంగా ఊరిస్తున్న ఇంటిపట్టాల పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. పట్టాల పంపిణీ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పేదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటినుంచి రాష్ట్రమంతా పేదలకు పంపిణీ

30.75 లక్షల మందికి స్థలాలు, ఇళ్ల నిర్మాణాలు

తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో ప్రారంభించనున్న జగన్‌

మహిళల పేరిట డీ-పట్టాలు... అందులోనే ముఖ్యమంత్రి సందేశం

జగన్మోహనపురం, వైఎస్సార్‌ జగనన్న కాలనీలుగా నామకరణం


అమరావతి, విశాఖ, కాకినాడ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలను సుదీర్ఘకాలంగా ఊరిస్తున్న ఇంటిపట్టాల పంపిణీ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. పట్టాల పంపిణీ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇంటి నిర్మాణాలనూ ప్రారంభించనున్నారు. వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్‌ పర్వదినాలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 30.75లక్షల మంది నిరుపేద కుటుంబాలకు.. ఆ కుటుంబాల్లోని మహిళల పేరిట ఇంటిపట్టాలు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కొమరగిరి గ్రామం నుంచి ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ వెంటనే అదే గ్రామంలో ఇళ్లనిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. అదే సమయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ‘నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు’ పథకం కింద డీ పట్టాల రూపంలో ఇంటిస్థలాలు ఇవ్వనున్నట్లు గురువారం రెవెన్యూశాఖ ఉత్తర్వులు (జీవో 391) జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లపట్టాల పంపిణీ, నిర్మాణాలకు వచ్చే నెల జనవరి ఏడో తేదీ వర కు శంకుస్థాపనల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇంటిస్థలాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి చొప్పున ఇస్తారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తయింది. లే అవుట్‌లు సిద్ధం చేశారు. వీటితో 17,500 వైఎ్‌సఆర్‌ జగనన్న కాలనీలు రానున్నాయి. 


పలు వాయిదాల తర్వాత..

అధికారంలోకి వస్తే అర్హులైన పేదలకు ఇంటిస్థలాలు ఇస్తామని వైసీపీ ఎన్నికల హామీ ఇచ్చింది. దీంట్లో భాగంగా తొలుత 25 లక్షలమంది పేదలకు కన్వేయెన్స్‌ డీడ్‌ రూపంలో పట్టాలు ఇస్తామని, నిబంధనలకు అనుగుణంగా వాటిని ఐదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చని హామీలిచ్చింది. చట్టబద్ధమైన డీ-పట్టాల రూపంలో కాకుండా కన్వేయెన్స్‌ డీడ్‌ల రూపంలోనే పేదలకు ఇంటిపట్టాలు ఇవ్వాలని ఫిబ్రవరిలో జీవో 44ను జారీ చేసింది. ఉగాదికి పట్టాలు పంపిణీ చేయాలని ముహూర్తం ఖరారు చేసింది. ఈలోగా విజృంభించిన కరోనా ప్రభావంతో అది ఆగిపోయింది.  కన్వేయెన్స్‌ డీడ్‌లకు చట్టబద్ధత లేదని జీవో44ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. హైకోర్టు ఆదేశాలను నిలుపుదలచేయాలని, కన్వేయెన్స్‌ డీడ్‌లకు  అనుమతించాలని సుప్రీం కోర్టును ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉండగానే పట్టాలను అంబేడ్కర్‌ జయంతి రోజు ఏప్రిల్‌ 14న, ఆ తర్వాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి జూలై 8న, ఆ తర్వాత ఆగస్టు 15న, గాంధీజయంతి రోజు అక్టోబరు 2న పంపిణీ చేసేలా అనేక మూహుర్తాలు ఖరారు చేసి వాయిదావేసుకుంది. ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు విచారణకు రాకపోవడం, మరోవైపు ఇంటిపట్టాల అంశం మరింత ఆలస్యమవుతుండటంతో చివరిగా డిసెంబర్‌ 25ని ముహూర్తంగా ఖరారు చేసింది. దీనికోసం కన్వేయెన్స్‌ డీడ్‌లకు బదులు, చట్టబద్దమైన విధానంలో డీ-ఫామ్‌ పట్టాలే ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు ఉంటాయన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటనల దరిమిలా సర్కారు ఈ ముహూర్తాన్ని తెరపైకి తెచ్చిందన్న చర్చ జరిగింది. 


కోర్టు కేసుల్లో ఉన్న చోట వాయిదా..

కోర్టులో కేసులున్న చోట ఇంటిపట్టాల పంపిణీని వాయిదావేశారు. కేసులు తేలిన తర్వాతే అక్కడ పట్టాల పంపిణీ చేపడుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని లేఖరూపంలో లబ్ధిదారులకు తెలియజేస్తామని సర్కారు ప్రకటించింది. రాజధాని అమరావతితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 4,65,987 ఇళ్లస్థలాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. కాగా, వాటిని వదిలిస్తే.. కొత్తగా ఇచ్చే ఇంటిస్థలాలు 22.80 లక్షల మేర ఉన్నాయి. ఇంకా టిడ్కో ఇళ్లు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారికి క్రమబద్ధీకరించడం కూడా ఇంటిపట్టాల పరిధిలోకే తీసుకొచ్చారు. దీంతో ఈ జాబితా ముందు అనుకున్న 25 లక్షలను మించి 30.75 లక్షలకు చేరుకుంది. 


15.6 లక్షల ఇళ్ల నిర్మాణాలు..

ఇంటిస్ధలాలను పంపిణీ చేయడంతో పక్కా ఇళ్ల నిర్మాణం కూడా వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే మూడేళ్ల వ్యవధిలో 28.3 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. తొలి దశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటినిర్మాణాలకు ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల వారీగా శంకుస్థాపనలు చేయనున్నారు. 


ప్రతి లేఅవుటూ రేపు గ్రామమే : బొత్స

రాష్ట్రంలో కొత్తగా 17 వేలగ్రామాలు రానున్నాయని పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ‘‘ఇళ్లపట్టాల కోసం 17వేల లేఅవుట్‌లను సిద్ధంచేశాం. ఒక్కో లే అవుట్‌ భవిష్యత్తులో ఒక్కో గ్రామంగా మారుతుంది’’ అని మంత్రి వివరించారు. సొంత స్థలం లేదా పూరిపాక ఉన్న వారికి ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. టీడీపీ హయాంలో ఇళ్ల కోసం డీడీలు కట్టిన వారి జాబితాను పరిశీలించామని, అందులో అర్హులందరికీ ఇళ్లు ఇస్తున్నామని, అనర్హులకు వారు కట్టిన మొత్తం తిరిగి ఇచ్చేస్తామన్నారు. 


కాకినాడ నుంచి పిఠాపురం పోవాలా?

ఇళ్లపట్టాల తీరుపై లబ్ధిదారుల పెదవివిరుపు

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని యు.కొత్తపల్లి మండలం కొమరగిరి గురువారం ఇళ్లపట్టాల పంపిణీ పథకానికి తొలి వేదిక కానుంది. పంపిణీ చేయడానికి ఈ గ్రామంలో 322 ఎకరాల్లో భారీ లేఅవుట్‌ను సిద్ధం చేశారు. 16,689 మంది లబ్ధిదారులను ఇప్పటికే గుర్తించారు. ఇళ్లస్థలాల పంపిణీ పథకం ప్రారంభోత్సవానికి గుర్తుగా నిర్మించిన గ్రామంలో నిర్మించిన పైలాన్‌ను జగన్‌ ఆవిష్కరిస్తారు. అనంతరం లబ్ధిదారులకు నిర్మించి ఇవ్వనున్న మోడల్‌ హౌస్‌ను సందర్శిస్తారు. కాగా, లేఅవుట్‌ల పంపిణీ తీరుపై లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. స్థలాలకు అర్హులుగా ఎంపికైనవారంతా కాకినాడవాసులు.


అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలోని పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని కొమరగిరిలో వీరందరికీ స్థలాలను కేటాయించారు. దీంతో.. అంతదూరంలో స్థలాలు తీసుకుని ఏంచేయాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. నగరంలో పనులు చేసుకుని జీవించే తమకు అంతదూరం వెళ్లి రావాలంటే సంపాదించేదంతా రవాణాకే పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొమరగిరి స్థలాలన్నీ సముద్రతీరానికి ఆనుకుని ఉన్నాయి. అక్కడ ఇళ్లు నిర్మించుకుంటే ఉప్పుగాలుల మధ్య ఎలా బతకాలని వాపోతున్నారు.

Updated Date - 2020-12-25T08:48:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising