ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మర్కజ్‌’కు వెళ్లలేదు!

ABN, First Publish Date - 2020-04-01T08:48:13+05:30

ఢిల్లీలో జరిగిన మర్కజ్‌ నిజాముద్దీన్‌ సమావేశాల్లో తాను పాల్గొనలేదని ఉప ముఖ్యమంత్రి అంజద్‌ బాషా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ప్రచారమైన వార్తల్లో నిజం లేదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • లాయర్లతో మాట్లాడేందుకు నెల కిందట ఢిల్లీకి!
  • ఉప ముఖ్యమంత్రి అంజద్‌ బాషా స్పష్టీకరణ

కడప, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):  ఢిల్లీలో జరిగిన మర్కజ్‌ నిజాముద్దీన్‌ సమావేశాల్లో తాను పాల్గొనలేదని ఉప ముఖ్యమంత్రి అంజద్‌ బాషా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ప్రచారమైన వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. ‘‘మార్చి 2వ తేదీన ఢిల్లీకి వెళ్లాను. ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిశాను. మర్కజ్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశాను’’ అని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 15, 16వ తేదీల్లో మర్కజ్‌ సమావేశాల్లో పాల్గొన్నారని... తాను 2వ తేదీన ఢిల్లీకి వెళ్లి మరుసటి రోజునే తిరిగి వచ్చానని చెప్పారు. 4వ తేదీన క్యాబినెట్‌ సమావేశంలో పాల్గొన్నానని... 5వ తేదీ నుంచి కడపలోనే ఉన్నానని అంజద్‌ బాషా ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.


Updated Date - 2020-04-01T08:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising