ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుకు డీజీపీ రాసిన లేఖ అనైతికంగా ఉంది: వర్లరామయ్య

ABN, First Publish Date - 2020-10-01T00:47:12+05:30

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ రాసిన లేఖ అనైతికంగా ఉందని టీడీపీ నేత వర్లరామయ్య తప్పుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ రాసిన లేఖ అనైతికంగా ఉందని టీడీపీ నేత వర్లరామయ్య తప్పుబట్టారు. అధికారపార్టీకి అండగా నిలవాలన్న డీజీపీ తపన, ఆకాంక్ష.. లేఖలో స్పష్టంగా కనిపించిందని విమర్శించారు. గతంలో దళితులపై దాడులకు సంబంధించి.. టీడీపీ తరుపున రాసిన లేఖలపై డీజీపీ ఇంతవేగంగా స్పందించలేదని ఆరోపించారు. కోర్టులు పలుమార్లు హెచ్చరించినా డీజీపీ వైఖరి మారలేదన్నారు. సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెప్పుకోసమే డీజీపీ పనిచేస్తే ఎలా? అని వర్లరామయ్య ప్రశ్నించారు. మంత్రి కొడాలినాని చంద్రబాబుని ఉద్దేశించి పరుష పదజాలం వాడినప్పుడు.. డీజీపీ మంత్రిని వారిస్తూ ఎందుకు లేఖరాయలేదు? అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై డీజీపీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. డీజీపీ లేఖను అంతతేలిగ్గా వదిలేది లేదని వర్లరామయ్య చెప్పారు.

Updated Date - 2020-10-01T00:47:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising