ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ‌గ‌న్‌ది లోపభూయిష్టమైన 3 రాజ‌ధానుల కోరిక‌: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-07-04T02:55:27+05:30

జ‌గ‌న్‌ది లోపభూయిష్టమైన 3 రాజ‌ధానుల కోరిక‌: చంద్రబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు. అన్యాయంగా చేసిన విభ‌జ‌న వ‌ల్ల పుట్టిన దుఖం నుంచి అమరావతి ఆవిర్భావం అయిందన్నారు. తెలుగువారిని ఏకం చేయ‌డానికి గొప్ప ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అమ‌రావ‌తి వేదిక‌ అని చంద్రబాబు అన్నారు. ధృడ‌‌ సంక‌ల్పం, మాన‌వ‌ వ‌న‌రులు.. ప్రజ‌ల్లోని నైపుణ్య శ‌క్తి క‌లిపి గొప్ప సెల్ఫ్ ఫైనాన్స్ రాజ‌ధాని అమ‌రావ‌తి అని చంద్రబాబు తెలిపారు. అమ‌రావ‌తి స్థానికంగా ఉద్యోగాల క‌ల్పన‌లోనూ.. ఆర్థిక వ్యవ‌స్ధ బ‌లోపేతంలోనూ కీల‌క భూమిక పోషించిందని చంద్రబాబు పేర్కొన్నారు. రైతులు త‌మ క‌ష్టానికి ప్రతిఫ‌లమైన 33 వేల ఎక‌రాలను అమ‌రావ‌తికి ఇచ్చారని, వైఎస్ జ‌గ‌న్‌ది లోపభూయిష్టమైన మూడు రాజ‌ధానుల కోరిక‌ అని చంద్రబాబు విమర్శించారు. అమరావతి ఆందోళనలు 200 రోజులైన సందర్భంగా సంఘీభావ కార్యక్రమాలు చేపట్టాలని, రాష్ట్రం కోసం భూములు ఇచ్చిన రైతులకు అందరూ సంఘీభావం తెలపాలని చంద్రబాబు సూచించారు. శనివారం నుంచి జేఏసీ సంఘీభావ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చంద్రబాబు అన్నారు.


Updated Date - 2020-07-04T02:55:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising