ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డుమ్మా కొట్టే టీచర్లకు దండన!

ABN, First Publish Date - 2020-09-19T09:02:59+05:30

సహేతుక కారణం లేకుండా ఇష్టానుసారం స్కూళ్లకు డుమ్మాకొట్టే ఉపాధ్యాయులపై పాఠశాల విద్యాశాఖ కొరడా ఝళిపించనుంది. అనధికారికంగా, ఉద్దేశపూర్వకంగా, లీవు పెట్టకుండానే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తక్షణమే షోకాజ్‌ నోటీసు జారీ..

పాఠశాల విద్యా కమిషనర్‌ ఆదేశాలు


అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): సహేతుక కారణం లేకుండా ఇష్టానుసారం స్కూళ్లకు డుమ్మాకొట్టే ఉపాధ్యాయులపై పాఠశాల విద్యాశాఖ కొరడా ఝళిపించనుంది. అనధికారికంగా, ఉద్దేశపూర్వకంగా, లీవు పెట్టకుండానే దీర్ఘకాలంపాటు స్కూళ్లకు గైర్హాజరయ్యే టీచర్లపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. 30 రోజులకుపైగా అనధికారికంగా గైర్హాజరయ్యే ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని గుర్తించి తక్షణమే షోకాజ్‌ నోటీసులు జారీచేయాలని స్పష్టంచేశారు. ఏడాదికాలం డుమ్మా కొట్టిన తర్వాత కూడా రిపోర్టు చేయని టీచర్ల పేర్లను స్థానిక వార్తా పత్రికల్లో ప్రచురించాలని తెలిపారు.


అయినప్పటికీ రిపోర్టు చేయకుంటే వారి పేర్లను గజిట్‌లో ప్రచురించి, 2017 సెప్టెంబరు 5 నాటి జీవోఎంఎ్‌స నంబరు 127 ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనధికారికంగా ఒక ఏడాదికి పైగా గైర్హాజరైనా, ఐదేళ్లపాటు నిరంతరంగా విధులకు రాకున్నా లేక సెలవు పెట్టకున్నా, ప్రభుత్వం అనుమతించిన కాలపరిమితికి మించి ఫారిన్‌ సర్వీ్‌సలో కొనసాగుతున్నా షోకాజ్‌ నోటీస్‌ జారీచేయాలన్నారు. ఈమేరకు రాష్ట్రంలోని ఆర్‌జేడీలు, డీఈవోలకు సూచనలు చేశారు. ఆయా టీచర్లపై చర్యలు తీసుకోకుంటే వీరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2020-09-19T09:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising