ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలు వద్దంటున్నా... మళ్లీ శనగలే

ABN, First Publish Date - 2020-11-03T09:29:50+05:30

ప్రతి నెలా మొదటి విడతలో బియ్యంతోపాటు కందిపప్పు పంపిణీ చేస్తున్న పౌర సరఫరాల శాఖ ఈసారి కందిపప్పును ఆపేసి మొదటి విడతలోనూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రతి నెలా మొదటి విడతలో బియ్యంతోపాటు కందిపప్పు పంపిణీ చేస్తున్న పౌర సరఫరాల శాఖ ఈసారి కందిపప్పును ఆపేసి మొదటి విడతలోనూ శనగలే ఇవ్వాలని నిర్ణయించింది. మంగళవారం నుంచి బియ్యంతోపాటు శెనగలు, పంచదార సరఫరా చేయనున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ఆరు నెలల నుం చి నెలకు రెండుసార్లు ఉచిత సరుకుల పంపిణీ జరుగుతోంది. ఈ నెలతో ఉచిత సరుకుల పంపిణీ ముగుస్తుంది. వచ్చే నెల నుంచి నెలకు ఒకసారి మాత్రమే రేషన్‌ పంపిణీ జరగనుంది. ఆరు నెలల నుంచీ మొదటి విడతలో బియ్యంతోపాటు కందిపప్పు, రెండో విడతలో శెనగలు ఇస్తున్నారు. అయితే శనగలు తీసుకునేందుకు కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు. అసలే కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తుండటంతో కందిపప్పునకు డిమాండ్‌ పెరిగింది. అందువల్ల మొదటి విడత రేషన్‌కు విపరీతమై డిమాండ్‌ ఉంటోంది. అయితే శనగల నిల్వలు భారీగా ఉన్నాయనే పేరుతో ఈసారి కందిపప్పు వదిలేసి శనగలతో సరిపెడుతున్నారు. కందిపప్పు ధర భారీగా పెరగడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Updated Date - 2020-11-03T09:29:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising