ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఈడీ కాలేజీలపై విచారణ వాయిదా

ABN, First Publish Date - 2020-10-01T08:51:07+05:30

రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ఇప్పటికే జరిగిన స్పాట్‌ అడ్మిషన్లను ప్రభుత్వం అనుమతించడం లేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ఇప్పటికే జరిగిన స్పాట్‌ అడ్మిషన్లను ప్రభుత్వం అనుమతించడం లేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చేసిన అభ్యర్థనతో న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారణను అక్టోబరు 16వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఈ పిటిషన్లపై రాష్ట్ర అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో కనిపించారు. అయితే, ఆయన చేతికి సెలైన్‌, ఆక్సీమీటర్‌ తదితరాలు ఉన్నాయి. దీంతో ఏమైందని అందరూ అడగ్గా.. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.  

Updated Date - 2020-10-01T08:51:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising