ఉసురు తీసిన అప్పులు
ABN, First Publish Date - 2020-09-14T08:29:44+05:30
అప్పుల బాధ తాళలేక భార్యాభర్తలు బలన్మరణానికి పాల్పడ్డారు.
‘ప్రకాశం’లోభార్యాభర్తల బలవన్మరణం
కట్టావారిపాలెం (కొండపి), సెప్టెంబరు 13: అప్పుల బాధ తాళలేక భార్యాభర్తలు బలన్మరణానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా కొండపి పంచాయతీ పరిధి కట్టావారిపాలెంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్థుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన చుండూరి సతీష్ (40), ప్రసన్న (33) భార్యాభర్తలు. సతీష్ సెల్‌ఫోన్ రీచార్జ్ కార్డులు విక్రయించేవాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో రెండు నెలలక్రితం చీమకుర్తిలో బంధువుల సహాయంతో ఔషధ దుకాణం ప్రారంభించాడు.
లాక్‌డౌన్ కారణంగా ఈ వ్యాపారం కూడా సరిగా నడవకపోవడం, రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో తీవ్ర మనోవేదనకు గురైన సతీష్ శనివారం రాత్రి ఇంటోనేఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్ని చూసి అతని భార్య కూడా పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఆదివారం ఉదయం నిద్రలేచిన వారి ఇద్దరు కుమార్తెలు తల్లిదండ్రులు విగతజీవిగా పడి ఉండటం చూసి బోరున విలపిస్తూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.
సమాచారం అందుకున్న సింగరాయకొండ సీఐ శ్రీనివాసరావు, కొండపి ఎస్సై వి. రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతదేహాలను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎస్సై రాంబాబు తెలిపారు.
Updated Date - 2020-09-14T08:29:44+05:30 IST