ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలంలో దర్శనం వివాదం

ABN, First Publish Date - 2020-09-21T08:16:24+05:30

శ్రీశైలం దేవస్థానంలో.. దర్శనం కోసం వెళ్లిన ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తలకు, అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి మధ్య జరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు, సెక్యూరిటీకి మధ్య వాగ్వాదం

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై లాఠీ...ఘటనపై కిషన్‌ రెడ్డి ఆరా

ఇద్దరు కానిస్టేబుళ్లు, సెక్యూరిటి సిబ్బందిపై చర్యలు  


కర్నూలు, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం దేవస్థానంలో.. దర్శనం కోసం వెళ్లిన ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తలకు, అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదం దుమారం రేపింది. తెలంగాణ నుంచి కొందరు ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తలు మల్లన్న దర్శనార్థం శనివారం శ్రీశైలానికి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో లోపలికి వెళ్లేందుకు అక్కడి సెక్యూరిటీని అనుమతి అడిగారు. అయితే దర్శనాల సమయం ముగిసిందని వారు నిరాకరించారు.


అదే సమయంలో కొందరు భక్తులను అదే మార్గం గుండా సిబ్బం ది లోపలికి పంపించడాన్ని చూసిన ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తలు.. సెక్యూరిటీని ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వా దం జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తల పట్ల దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. ఆపై చీఫ్‌ సెక్యూరిటీ అధికారి వద్దకు చేరిన వివాదం... ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. రామకృష్ణ, దాస్‌ అనే కానిస్టేబుళ్లు లాఠీలు ప్రయోగించారని తెలిసింది. దేవాలయ సీఎ్‌సఓ కూడా వారిపై చేయి చేసుకున్నట్లు సమాచారం. మొత్తం వ్యవహారాన్ని ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తలు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి చేరవేశారు.


స్పందించిన మంత్రి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను వివరణ కోరారు. ఈ ఘటనపై  డీజీపీ వెంటనే విచారణకు ఆదేశించారు. ఈమేరకు ఆత్మకూరు డీఎస్పీ ఆదివారం శ్రీశైలం చేరుకుని విచారణ చేపట్టారు. సంఘటనకు బాధ్యులైన ఇద్దరు కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. ఆలయ ఉన్నతాధికారులు కూడా సెక్యూరిటీ సిబ్బందిపై వేటు వేశారు.


Updated Date - 2020-09-21T08:16:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising