ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాతను దెబ్బతీసిన అకాల వర్షాలు

ABN, First Publish Date - 2020-04-10T18:37:51+05:30

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతను దెబ్బతీశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతను దెబ్బతీశాయి. ఈదురుగాలులు, భారీ వర్షాలకు పంటలు ధ్వంసమయ్యాయి. పరుచూరు, మార్టూరు, దర్శి, వైపాలెం తదితర వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో కల్లాల్లో ఉన్న మిరపకాయలు తడిసిపోయాయి. కొంతమంది మాత్రం టార్పాన్లు కప్పారు. వందలాది ఎకరాల్లో చేతికంది వచ్చిన పంట తడిసిపోవడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. వరి, అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి.


గిద్దలూరు, రాచర్ల, కంభం, కొమరోల్లో ఒక్కరోజు కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. ఈదురుగాలుల ఉధృతికి పలుచోట్ల చెట్లు, హోర్డింగులు నేలకూలాయి. భారీ వర్షాలకు డ్రైనేజ్‌లు సయితం పొంగి రోడ్డుపైకి ప్రవహించడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. కడపజిల్లా రైల్వేకోడూరు, రాజంపేట, పులివెందుల, రాయచోటి, కడప నియోజకవర్గాల్లో 2,663 హెక్టార్లలో అరటి, బొబ్బాయి, మామిడి, తమలపాకు, మునగ పంటలు దెబ్బతిన్నాయి. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో తోటలోనే మాగిపోతున్న అరటి గెలలు నెలకొరిగిపోయాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

Updated Date - 2020-04-10T18:37:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising