ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వితంతువులకు కుటుంబ పింఛను కట్‌

ABN, First Publish Date - 2020-09-25T08:48:16+05:30

కుటుంబ పింఛను పొందుతున్న వితంతువులు/ విడాకులిచ్చిన కుమార్తెలకు 45 ఏళ్లు నిండిన వెంటనే పెన్షన్‌ నిలిపేయాలని ఆర్థికశాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

45 ఏళ్లు నిండిన వెంటనే నిలిపివేత 

ఆదేశాలు జారీ చేసిన ఆర్థికశాఖ 


అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కుటుంబ పింఛను పొందుతున్న  వితంతువులు/ విడాకులిచ్చిన కుమార్తెలకు 45 ఏళ్లు నిండిన వెంటనే పెన్షన్‌ నిలిపేయాలని ఆర్థికశాఖ ఆదేశాలిచ్చింది. వితంతువులు/విడాకులిచ్చిన కుమార్తెల కుటుంబ పింఛన్ల అర్హతలపై స్పష్టతనిస్తూ మెమో జారీ చేసింది. గతంలో వారికి ఎక్కువ చెల్లించి ఉన్నా ఎలాంటి రికవరీ చేయరాదని పేర్కొంది. కుటుంబ పింఛనుకు సంబంధించిన కేసులన్నీ మరోసారి సమీక్షించాలని, అనర్హులకు పెన్షన్‌ నిలిపివేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని, తిరిగి పెళ్లి చేసుకోవడం, సంపాదన ప్రారంభించడం, పిల్లలు మేజర్‌ అవడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.


కేటగిరీ-2 కింద పెన్షన్‌ మంజూరైన వారికి ఎలాంటి అంతరాయం లేకుండా అర్హత ఉన్నంత కాలం అంటే 45ఏళ్లు పూర్తయ్యే వరకు చెల్లించే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. కుటుంబ పెన్షన్‌ పొందుతున్న వారు మృతిచెందిన ఏడాది లోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆ మెమోలో ఆర్థికశాఖ సూచించింది. 


Updated Date - 2020-09-25T08:48:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising