క్రికెట్ బెట్టింగులపై నిషేధం... వాలెట్ లో డబ్బుంటే తిరిగి చెల్లిస్తారు
ABN, First Publish Date - 2020-09-30T19:25:53+05:30
పొట్టి ఓవర్ల క్రికెట్ లీగ్ ఐపీఎల్ నేపధ్యంలో... బెట్టింగుల పర్వానికి తెరపడింది. మ్యాచ్ జరిగే జట్ల నుంచి ఆటగాళ్ళను ఎంచుకొని యూజర్లు తమ డ్రీమ్ జట్టును ఏర్పాటు చేసుకుంటారు. మ్యాచ్‌లో యూజర్లు ఎంచుకున్న ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా పాయింట్లు లభిస్తాయి. వీటి ఆధారంగా డబ్బు చేతికందుతుంది.
అమరావతి : పొట్టి ఓవర్ల క్రికెట్ లీగ్ ఐపీఎల్ నేపధ్యంలో... బెట్టింగుల పర్వానికి తెరపడింది. మ్యాచ్ జరిగే జట్ల నుంచి ఆటగాళ్ళను ఎంచుకొని యూజర్లు తమ డ్రీమ్ జట్టును ఏర్పాటు చేసుకుంటారు. మ్యాచ్‌లో యూజర్లు ఎంచుకున్న ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా పాయింట్లు లభిస్తాయి. వీటి ఆధారంగా డబ్బు చేతికందుతుంది.
కాగా... బెట్టింగుల్లో యువత ఎక్కువగా పాల్గొంటుండడంతో... దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పెద్దసంఖ్యలో యువకులు... చదువును నిర్లక్ష్యం చేస్తుండడం, డబ్బును పోగొట్టుకుని అప్పులు చేసుకుంటూండడం వంటి పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో... బెట్టింగులపై నిషేధం విధించారు.
కాగా క్రికెట్ బెట్టింగులపై... తెలంగాణ, అసోం, ఒడిశా, నాగాలాండ్ ప్రభుత్వాలు ఇప్పటికే నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా... ఆంధ్రప్రదేశ్ లో కూడా ఐపీఎల్ స్పాన్సర్ డ్రీమ్ 11 పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్‌లో జరిగిన సవరణల కారణంగా ఏపీలోని ‘డ్రీమ్ 11’ యూజర్లు నిరాశకు గురయ్యారు.
కాగా... డబ్బు చెల్లించే కంటెస్ట్‌లకు మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుంది. కాగా... ఇప్పటికే తమ వ్యాలెట్‌లో ఉన్న డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలని అని చాలా మంది యూజర్లు ప్రశ్నిస్తున్న నేపధ్యంలో... వాలెట్ నుంచి నగదు ఉపసంహరణపై డ్రీమ్ 11 స్పందించింది.
ఆ డబ్బు... డ్రీమ్ 11 వాలెట్‌లో సేఫ్‌గా ఉంటుందని, ఇందుకుసంబంధించిన వివరాల కోసం http://d11.co.in/HelpCenter లోకి వెళ్లి ‘కాంటాక్ట్ అజ్’ కింద తమను సంప్రదిస్తే... డబ్బును తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది.
Updated Date - 2020-09-30T19:25:53+05:30 IST