ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఆర్డీఏ రద్దుపై హైకోర్టులో వాదనలు

ABN, First Publish Date - 2020-12-04T02:35:56+05:30

రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వివిధ పద్ధతుల్లో రైతులు నిరసనలు తెలుపుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వివిధ పద్ధతుల్లో రైతులు నిరసనలు తెలుపుతున్నారు.  ఈ రోజుతో అమరావతి పరిరక్షణ కోసం రైతులు చేస్తున్న ఉద్యమం 352వ రోజుకి చేరింది.  రాజధాని అమరావతి అంశం, సీఆర్డీఏ రద్దుపై  పిటిషనర్ మండవ సుబ్బారావు, రైతుల తరపున హైకోర్టులో న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, పీఎన్ఆర్వీ ప్రసాద్ బలమైన వాదనలు వినిపించారు. 


రైతుల తరఫున న్యాయవాదుల వాదనలు..

సీఆర్డీఏ రద్దు చేస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టం చెల్లదు.

సీఆర్డీఏ చట్టంలో రైతులకు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించడం రాజ్యాంగ విరుద్ధం.

మూడు రాజధానులు,అభివృద్ధి వికేంద్రీకణ అంశం రెండు వేర్వేరు అంశాలు.

రెండింటినీ ఒకే అంశంగా చూడలేము.

ఉమ్మడి రాష్ట్రంలోనే విశాఖ అభివృద్ధి చెందింది.

అభివృద్ధి చెందిన విశాఖను పరిపాలనా రాజధానిగా తరలించడం భావ్యం కాదు.

శివరామకృష్ణ కమిటీ కూడా గతంలో విశాఖ అభివృద్ధి చెందింది... రాజధానికి సేఫ్ కాదని చెప్పింది.

రాజధానిపై కేంద్రానికి అధికారం ఉంది.

రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిగా కేంద్రం ప్రకటించింది.

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కేంద్రం నిర్ణయించలేదా?

మరి ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో జోక్యం చేసుకోమని కేంద్రం ఎలా చెబుతుంది.

వేలకోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన భవనాలు ఇప్పుడు ఏమై పోవాలి.

ఏపీ‌కి అమరావతి ఒక్కటే రాజధాని.

ప్రభుత్వాన్ని నమ్మి రైతులు వేల ఎకరాల భూములు ఇచ్చారు.

రాజ్యానికి ఎక్కువ అధికారం ఉంటుంది.

రైతుల గోడు ప్రభుత్వం వినడం లేదు.

రైతుల గోడు ఇప్పుడు న్యాయస్థానం వినాలి.

శివరామకృష్ణన్ కమిటీని పక్కన పెట్టి ఇప్పుడు కొత్త చట్టాన్ని, మూడురాజధానులను  ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది.

అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణం జరిగింది రైతులిచ్చిన భూముల్లోనే జరిగింది.

న్యాయరాజధాని మార్పుపై ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది

న్యాయ రాజధాని మార్పుపై సుప్రీంకోర్టు, హైకోర్టును ప్రభుత్వం సంప్రదించాలి.

అలా సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధం.

న్యాయ రాజధానిని ఏకపక్షంగా నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి లేదు.

Updated Date - 2020-12-04T02:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising