ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ ఎంక్వైరీ వేశాక చలో అంతర్వేది అవసరమా?: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-09-18T22:07:29+05:30

రాష్ట్ర బీజేపీ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. అంతర్వేది ఘటనపై బీజేపీ రాద్ధాంతం చేయడం ఎందుకు? అని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్ర బీజేపీ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. అంతర్వేది ఘటనపై బీజేపీ రాద్ధాంతం చేయడం ఎందుకు? అని ప్రశ్నించారు. అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనను అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయన్నారు. అలాగే అంతర్వేది ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిందని గుర్తుచేశారు. అయినా బీజేపీ మాత్రం చలో అంతర్వేదికి పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా అంతర్వేది వెళ్లే బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్, నిర్బంధాలు చేసి ప్రచారం కల్పించాల్సిన అవసరం ఏముంది? ఒక పక్క కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉంటున్న వైసీపీ.. మరో పక్క రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకమన్నట్లు ప్రజలను మభ్యపెడుతోందన్నారు. బీజేపీ-వైసీపీల దోబూచులాట ఇకనైనా కట్టిపెట్టాలి’ అని రామకృష్ణ హితవు పలికారు.

Updated Date - 2020-09-18T22:07:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising