కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన
ABN, First Publish Date - 2020-09-14T17:03:23+05:30
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా సీపీఐ ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడ దాసరి భవన్‌లో సీపీఐ
విజయవాడ : కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా సీపీఐ ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడ దాసరి భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రామకృష్ణ.. కార్పొరేట్ ఎజెండా, కాషాయ ఎజెండాతో మోదీ ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ వైఫల్యాల వలన కరోనా వ్యాప్తిలో భారత్ మొదటి స్థానానికి చేరువ అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనస్ 23.9 శాతం జీడీపీ పడిపోయిందన్నారు. అంబానీ, అదాని ఆస్తులను పెంచుకునేలా మోదీ నిర్ణయాలు ఉన్నాయని దుయ్యబట్టారు. కరోనా కష్ట కాలంలో కోట్లాది మంది ప్రజలను గాలికి వదిలేశారని రామకృష్ణ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు. ఢిల్లీ నుండి గల్లీ వరకు మోదీ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ఎండగడతామని రామకృష్ణ పేర్కొన్నారు.
Updated Date - 2020-09-14T17:03:23+05:30 IST