చనిపోయిన వలసకూలీల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి: రామకృష్ణ
ABN, First Publish Date - 2020-05-09T14:09:20+05:30
చనిపోయిన వలసకూలీల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి: రామకృష్ణ
అమరావతి: లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వలస కూలీలందరినీ స్వస్థలాలకు చేర్చేందుకు సత్వర చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆయన లేఖ రాశారు. చనిపోయిన వలస కూలీల కుటుంబాలకు తక్షణమే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. లాక్‌డౌన్ ప్రకటించి 45 రోజులు దాటినప్పటికీ వలస కూలీలు ఇబ్బందులు తొలగిపోలేదని తెలిపారు.
అనంతపురం జిల్లా గుత్తిలో గత 40 రోజులుగా 122 మంది వలస కూలీలను పోలీసులు నిర్బంధించారన్నారు. మంగళగిరి వద్ద బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌కు చెందిన 1500 మంది వలస కూలీలు తీవ్ర అసహనంతో ఆందోళన చేపట్టారని...పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వివాదం ముదరకుండా చర్యలు చేపట్టారని అన్నారు. ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు వలస కూలీలు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారన్నారు. విశాఖ మృతులకు తక్షణమే ఎక్స్ గ్రేషియా ప్రకటించారని...అయితే చనిపోయిన వలస కూలీల కుటుంబాలను ఆదుకోవడంలో వివక్ష తగదని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2020-05-09T14:09:20+05:30 IST