ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలి: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-09-17T13:13:07+05:30

కేంద్ర విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేంద్ర విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. డిస్కంల నిర్వహణ, సబ్సిడీలు, ఈఆర్‌సి వంటివి కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోయి, రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపితే రైతులకిచ్చే ఉచిత విద్యుత్‌కు మీటర్లు బిగించడం తప్పనిసరి అవుతందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రాక్షస బిల్లుగా పరిగణించి, బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిందని కానీ ఏపీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలకు పచ్చజెండా ఊపి ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ అంటోందని మండిపడ్డారు. కేవలం రుణ పరిమితి పెంచుకొని, అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతి కోసం కేంద్ర నిర్ణయాలకుసై అనటం సరికాదని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-17T13:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising