ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ తరహాలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించండి: రామకృష్ణ

ABN, First Publish Date - 2020-09-16T14:18:19+05:30

రాష్ట్రంలో తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకై చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకై చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. ఇళ్ల స్థలాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల ఎకరాల భూములను సేకరించారని... అయితే కేవలం 4 వేల ఎకరాల భూములకు సంబంధించి మాత్రమే వివాదాలు తలెత్తాయని అన్నారు. మిగిలిన 39 వేల ఎకరాల భూములను తక్షణమే పంపిణీ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలకై పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున కేటాయించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ టిడ్‌కో ఆధ్వర్యంలో నిర్మించిన 6 లక్షల గృహాలకు ఇప్పటికైనా తుది మెరుగులు దిద్ది లబ్ధిదారులకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-16T14:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising