అపెక్స్ కౌన్సిల్ వాయిదా పడటం హర్షణీయం: రామకృష్ణ
ABN, First Publish Date - 2020-08-22T15:53:20+05:30
ఈనెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ వాయిదా పడటం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.
అమరావతి: ఈనెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ వాయిదా పడటం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. గోదావరి, కృష్ణా నదుల వరద నీరు వృథాగా సముద్రం పాలవుతోందని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంల జల వివాదాల వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. పుష్కలంగా ఉన్న నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు సక్రమంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నీటి తగాదాలకు తావిస్తూ అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లడం సరికాదన్నారు. తమకు భేషిజాలు లేవన్న కేసీఆర్, జగన్‌లు నీటి వివాదాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. పలు విషయాల్లో పరస్పరం సహకరించుకునే కేసీఆర్, జగన్‌లు ప్రజా సమస్యల పట్ల కూడా చిత్తశుద్ధి చూపాలని రామకృష్ణ హితవు పలికారు.
Updated Date - 2020-08-22T15:53:20+05:30 IST