ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సృష్టి’ శిశు విక్రయాల కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ABN, First Publish Date - 2020-08-06T23:33:07+05:30

‘సృష్టి’ యూనివర్సల్ పసిపిల్లల ఆక్రమ రవాణా కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం విదితమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : ‘సృష్టి’ యూనివర్సల్ పసిపిల్లల ఆక్రమ రవాణా కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం విదితమే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిశితంగా దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి విశాఖ సీపీ ఆర్కే మీనా మీడియా మీట్ నిర్వహించారు. సృష్టి యూనివర్సల్ ఆస్పత్రికి నగరంలోని పద్మజ ఆసుపత్రికి లింకులున్నాయని స్పష్టమైంది. కాన్పుల్లో క్లిష్టమైన డెలివరీ కేసులు డాక్టర్ పద్మజకు నమ్రత రిఫర్ చేసినట్లు దర్యాప్తులో తేలిందని సీపీ తెలిపారు. చోడవరం నుంచి కాన్పు కోసం వచ్చిన ఓ డెలివరీ కేసును నమ్రత.. పద్మజకు అప్పగించారని.. ఆమె సూచనలు మేరకు పుట్టిన బిడ్డను చనిపోయినట్లు తల్లిని ఆస్పత్రి సిబ్బంది నమ్మించిందన్నారు.


మరో ఇద్దరు అరెస్ట్..


బిడ్డ సరోగసి ద్వారా పుట్టినట్లు రికార్డు సృష్టించారు. విజయనగరం దంపతులుకు 13 లక్షలకు విక్రయించారు. సృష్టి యూనివర్సల్ కేసు బయటకు రావడంతో ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో చోడవరంకు చెందిన మహిళా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మరో ఇద్దర్ని అరెస్ట్ చేశాం. డాక్టర్ పద్మజ, ఆశావర్కర్ నూకరత్నం అరెస్ట్ చేశాం. ఇప్పటి వరకూ సృష్టి పసిపిల్లల ఆక్రమ రవాణా కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. ఆస్పత్రిలో మొత్తం 63 మందికి సరోగసీ ద్వారా గుర్తించాం. ఇప్పటివరకు నలుగురికి సంబంధించిన విషయంలో కేసులు నమోదయ్యాయి.. దర్యాప్తు కూడా చేస్తున్నాం. సృష్టి అక్రమాలపై ఇంకా లోతుగా విచారిస్తున్నాం అని సీపీ మీనా మీడియాకు వెల్లడించారు.

Updated Date - 2020-08-06T23:33:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising