ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అవినీతి: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2020-07-08T21:14:24+05:30

ఏపీలో ఇళ్ల స్థలాల కేటాయింపులకు సంబంధించి అధికారపార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: ఏపీలో ఇళ్ల స్థలాల కేటాయింపులకు సంబంధించి అధికారపార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు ఆరోపించారు. సీఎం జగన్‌తో కూడా స్థలాల విషయంలో మాట్లాడానని చెప్పారు. పంపిణీ కార్యక్రమాన్ని వాయిదాల మీద వాయిదా వేస్తున్నారని విమర్శించారు. దీనికి రకరకాల కారణాలు వాళ్లే చెబుతున్నారన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సబ్సిడి ఇస్తుందన్నారు. ఇళ్ల నిర్మాణం విషయంలో ఎవరికీ కాంట్రాక్ట్ ఇవ్వకుండా, గందరగోళం చేయకుండా కేంద్రం ఇచ్చే లక్షా 20వేలు, అలాగే రాష్ట్రం కూడా లక్షా 20వేలు సబ్సిడీ ఇస్తూ.. నేరుగా లబ్దిదారులకే ఇవ్వవాలని, వాళ్లే ఇళ్లు నిర్మించుకుంటారని సోము వీర్రాజు సూచించారు. స్థలాల కొనుగోలు వ్యవహారంలో అధికారపార్టీ నేతలు ఎలకల్లా ఎక్కడికక్కడ కొరుకుతున్నారని ఆరోపించారు. ఇళ్లు పంపిణీ విషయంలో అవినీతి జరిగితే బీజేపీ ఊరుకోదని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2020-07-08T21:14:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising