కేజీహెచ్‌లో కరోనాతో మహిళ మృతి
ABN, First Publish Date - 2020-05-10T01:17:14+05:30
విజయనగరానికి చెందిన ఓ మహిళ కరోనా విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే జీవియంసీ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మర్రిపాలెం కరాసా
విశాఖపట్నం: విజయనగరానికి చెందిన ఓ మహిళ కరోనా విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే జీవియంసీ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని మర్రిపాలెం కరాసా శ్మశానవాటికలో పూడ్చిపెట్టారు. కాగా, తమ ప్రాంతంలో కరోనాతో మృతి చెందిన మహిళను పూడ్చి పెట్టారని తెలుసుకున్న గ్రామస్తులు జీవీయంసీ అధికారులను అడ్డుకున్నారు. స్థానిక ఆందోళనకు స్పందించిన ఓ అధికారి.. విశాఖ రాజధాని కావాల్సిన సమయంలో ఇటువంటి సమస్యలు సృష్టించకూడదంటూ వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2020-05-10T01:17:14+05:30 IST