కాశీ నుంచి కరోనా!
ABN, First Publish Date - 2020-05-10T02:07:38+05:30
విదేశాల నుంచి వారితోనే కరోనా ముప్పు అని మొదట్లో భయపడ్డారు. ఆ తర్వాత ఢిల్లీ లింకులు రాష్ట్రాన్ని అతలాకుతలం...
హైదరాబాద్: విదేశాల నుంచి వారితోనే కరోనా ముప్పు అని మొదట్లో భయపడ్డారు. ఆ తర్వాత ఢిల్లీ లింకులు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఆ వేడి పూర్తిగా చల్లారక ముందే తాజాగా మరోవైపు నుంచి వైరస్ దాడి మొదలైంది. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌లో వారణాశి నుంచి వచ్చిన వారిలో 29 మందికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.
పశ్చిమగోదావరి జిల్లాలో కాశీ యాత్రకు వెళ్లి వచ్చిన 9 మందికి కరోనా అని నిర్ధారణ అయింది. వీరిలో 8 మంది భక్తులు, క్యాబ్ డ్రైవరు ఉన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు మార్చిలో బయలు దేరారు. కాశీ చుట్టుపక్కల పుణ్య క్షేత్రాలను సందర్శించారు. ఈలోపే లాక్‌డౌన్ ప్రకటించడంతో వీరంతా కొద్ది రోజులపాటు కాశీలోనే ఉండిపోయారు. ఆ తర్వాత క్యాబ్ మాట్లాడుకుని ఈ నెల 2న రాజమండ్రికి చేరుకోగా అక్కడ పోలీసులు వీరందర్నీ భీమడోలు క్వారంటైన్‌కు తరలించారు. శుక్రవారం వీరి రిపోర్టులు వచ్చాయి. అందరికీ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వీరిని క్యాబ్‌లో తీసుకొచ్చిన యూపీకి చెందిన డ్రైవర్‌కు కూడా కరోనా సోకడంతో అందరినీ ఏలూరులోని ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2020-05-10T02:07:38+05:30 IST