ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఘటనతోనే ఏపీలో కరోనా కేసులు పెరిగాయి: మంత్రి బుగ్గన

ABN, First Publish Date - 2020-04-07T22:09:07+05:30

కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కరోనా నివారణకు లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నామని, పీపీఈ కిట్స్ కొరత ఉన్నా..అందుబాటులో ఉన్న వరకు అందజేస్తున్నామని చెప్పారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా వైద్యులకు పీపీఈ కిట్స్, మాస్క్‌లు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. వైద్య పరికరాల కొనుగోలుకు సీఎం వెనుకడుగు వేయడం లేదని బుగ్గన పేర్కొన్నారు. రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్‌లను నాలుగు నుంచి ఏడుకు పెంచామని మంత్రి బుగ్గన చెప్పారు. దేశంలో అతి తక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి అని, అనుకోని ఘటన కారణంగానే ఏపీలో కేసులు పెరిగాయని మంత్రి బుగ్గన వెల్లడించారు. వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, మున్సిపల్‌, వైద్యసిబ్బంది పనితీరు అభినందనీయమన్నారు. చిన్న చిన్న తప్పులకు ప్రతిపక్షాలు వేలెత్తి చూపడం దారుణమని మంత్రి బుగ్గన మండిపడ్డారు.

Updated Date - 2020-04-07T22:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising