ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ అడిగితే సస్పెండ్‌ చేస్తారా?

ABN, First Publish Date - 2020-04-09T09:15:43+05:30

మాస్క్‌ అడిగితే సస్పెండ్‌ చేస్తారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ వైఖరి దిగ్ర్భాంతికరం: చంద్రబాబు

దళిత డాక్టర్‌పై అధికార మదం: లోకేశ్‌


నర్సీపట్నం టౌన్‌, అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ఎన్‌-95 మాస్క్‌ ఇవ్వాలని కోరిన ప్రభుత్వ వైద్యుడిని సస్పెం డ్‌ చేయడం దారుణమని మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి డా క్టర్‌ సుధాకర్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయడంపై బుధవారం ట్విటర్‌లో స్పందించారు. ‘ఆస్పత్రిలో వైద్యులకు మాస్కులు, గ్లౌజ్‌లు లేకపోవడాన్ని సుధాకర్‌ ఎత్తిచూపారు. వాటిని సమకూర్చడం ప్రభుత్వ కనీస ధర్మం. సమస్యను పరిష్కరించాల్సిందిపోయి వైద్యుడిని సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వ వైఖరి ది గ్ర్భాంతి కలిగిస్తోంది. వైద్య సిబ్బందిని ఇలా అవమానపరిస్తే వారికి మనో ధైర్యం కల్పించడం ఎలా సాధ్యపడుతుంది? ఈ విపత్కర పరిస్థితుల్లో వైద్యులను, వైద్య సిబ్బందిని అన్ని వి ధాలుగా కాపాడుకోవాలి. రక్షించుకోవాలి’ అని ట్వీట్‌ చేశారు. సస్పెన్షన్‌ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కూడా ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ‘ఒక దళిత వై ద్యుడిపై మీ ప్రతాపం చూపిస్తారా.. జగన్‌! మీ ఇగో హర్ట్‌ అయ్యిందని డాక్టర్‌ సుధాకర్‌ను సస్పెండ్‌ చేయడం దారుణమైన చర్య. కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతు న్న డాక్టర్లకు, సిబ్బందికి మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు ఇ వ్వలేని దద్దమ్మ ప్రభుత్వం మీది. మాస్కులు అడిగిన డాక్టర్‌ ను సస్పెండ్‌ చేయడం జగన్‌ అధికార మదానికి నిదర్శనం. డాక్టర్ల దగ్గర ఉండాల్సిన మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు కొట్టేసి మీడియాకు ఫోజులు ఇస్తున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఏం చెయ్యాలి? అసలు కరోనా పెద్ద విషయం కాదు..ఎన్నికలే ముఖ్యం అని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన మీకు ఏం శిక్ష వేయాలి?’ అని నిలదీశారు. కాగా, డాక్టర్‌ కె.సుధాకర్‌ చెప్పింది ఎంత వరకూ వాస్తవమో చేతనైతే ప్రభుత్వం విచారణ జరపాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో సవాలు విసిరారు.  

Updated Date - 2020-04-09T09:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising