ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

48 గంటల్లో కరోనా ఫలితం!

ABN, First Publish Date - 2020-07-08T08:37:14+05:30

కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ల్యాబొరేటరీల్లో పేరుకుపోతున్న నమానాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇకనుంచి కరోనా పరీక్షలను హేతుబద్దంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కలర్‌ కోటెడ్‌తో 4 కేటగిరీలుగా విభజన
  • ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ

గుంటూరు(మెడికల్‌), జూలై 7: కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ల్యాబొరేటరీల్లో పేరుకుపోతున్న నమానాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇకనుంచి కరోనా పరీక్షలను హేతుబద్దంగా నిర్వహించాలని నిర్ణయించింది. ‘పెండింగ్‌లో 2 లక్షల కరోనా నమూనాలు’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ఈ నెల 2, 3 తేదీల్లో కథనాలు వెలువడిన నేపథ్యంలో.. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం నూతన మార్గదర్శకాలు జారీచేశారు. 


ఎక్స్‌ట్రీమ్‌లీ ఎమర్జెన్సీ కేటగిరి: దీనికి రెడ్‌ కల ర్‌ కేటాయించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌తోపాటు హై ప్రొఫైల్‌ వ్యక్తులు, కట్టడి ప్రాంతా లు, ఆస్పత్రుల్లో కోలుకొని డిశ్చార్జి కోసం ఎదురుచూసే రో గులను ఈ కేటగిరీలో చేర్చారు. 12 గంటల్లోపు పరీక్షలు చేసి ఫలితాలు అందిస్తారు. 

వెరీ అర్జెంట్‌ కేటగిరి: దీనికి ఆరెంజ్‌ కలర్‌ కేటాయించారు. కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసంతో బాధపడే రోగులు, ఆరోగ్య సేవ లు అందించే సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపాల్టీ సిబ్బందిని ఈ విభాగంలో చేర్చారు. 24 గంటల్లోపు పరీక్షించి ఫలితాలు ప్రకటిస్తారు. 


అర్జెంట్‌ కేటగిరి: దీనికి బ్లూ కలర్‌ కేటాయించారు. ఆరోగ్య శాఖ నిర్వహించే సీరో సర్వేలెన్స్‌, టార్గెట్‌ టెస్టింగ్‌ గ్రూప్‌లు, వృద్ధులు, హై రిస్క్‌ సమూహాలు, ఆరోగ్యసేతు హెచ్చరించే కేసులను ఈ విభాగంలోకి వస్తాయి. ఈ కేటగిరీ నమూనాలను 36 గంటల్లోపు పరీక్షించి ఫలితాలు అందిస్తారు. 


నార్మల్‌ కేటగిరి: దీనికి గ్రీన్‌ కలర్‌ కేటాయించారు. పైన పేర్కొన్న వారు మినహా మిగిలిన వారంతా ఈ గ్రూప్‌లోకి వస్తారు. ఈ నమూనాలను 48 గంటల్లోపు పరీక్షించి ఫలితాలు ప్రకటిస్తారు. 

Updated Date - 2020-07-08T08:37:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising