ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్షలు కాదు.. 74 వేలే!

ABN, First Publish Date - 2020-07-14T07:48:59+05:30

రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెలల కాలంలో దాదాపు 74 వేల కరోనా శాంపిళ్లను వివిధ కారణాలతో ల్యాబుల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రకాశంలో 3153 శాంపిల్సే వృథా: ఆరోగ్యశాఖ

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెలల కాలంలో దాదాపు 74 వేల కరోనా శాంపిళ్లను వివిధ కారణాలతో ల్యాబుల్లో తిరస్కరించామని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ‘‘నమూనాలు నట్టేట’’ అన్న శీర్షికతో సోమవారం ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై ఆరోగ్యశాఖ అధికారులు వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో లక్షల శాంపిల్స్‌ వృథా కాలేదని కేవలం 74 వేల శాంపిల్స్‌ వివిధ కారణాలతో తిరస్కరణకు గురైనట్లు తెలిపారు. కోవిడ్‌ పరీక్షలు జరిపే ల్యాబుల్లో కొన్ని తిరస్కరించడం సహజమేనని తెలిపారు. రాష్ట్రంలో కరోనా సమస్య మొదలైనప్పటి నుంచి నేటి వరకూ ఆరోగ్యశాఖ 12 లక్షల శాంపిళ్లను పరీక్షించిందన్నారు. శాంపిల్స్‌ సేకరణ కోసం పోర్టల్‌ను ప్రత్యేకంగా తయారు చేశామన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చాకే సేకరణ చేపట్టామని, 2-3 జిల్లాల్లో మినహాయించి ఇతర జిల్లాల్లో 24 నుంచి 48 గంటల్లో రిపోర్టులు ఇస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లాలో 27 వేల శాంపిల్స్‌ వృథా అయ్యాయనడం వాస్తవం కాదని, 3153 శాంపిల్స్‌ మాత్రమే వృథా అయ్యాయని తెలిపారు.

Updated Date - 2020-07-14T07:48:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising