ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కరోనా నివారణకు చర్యలు: కమిషనర్

ABN, First Publish Date - 2020-07-14T21:53:34+05:30

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కరోనా నివారణకు చర్యలు: కమిషనర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యాలయానికి ఎవ్వరూ రావద్దని అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. విభాగాధిపతి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పీఆర్ఆర్డీ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఆదేశాలిచ్చారు. జిల్లాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది కూడా ప్రధాన కార్యాలయానికి రావద్దని సర్క్యులర్ లో పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ, జిల్లా అధికారుల అనుమతి లేనిదే జిల్లా ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పనులేమైనా ఉంటే ప్రధాన కార్యాలయానికి ఈ మెయిల్స్ పంపాలని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతి తగ్గేంత వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని కమిషనర్ గిరిజా శంకర్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-07-14T21:53:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising