ప్రకాశం జిల్లాలో మరో 4 కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-06-01T12:33:43+05:30
ప్రకాశం జిల్లాలో మరో 4 కరోనా కేసులు
ప్రకాశం: జిల్లాలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 88 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న కందుకూరులో తండ్రీకొడుకులకు, ఉలవపాడు మండలం కరేడులో ఒకరితో పాటు టంగుటూరులో ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 37,004 శ్యాంపిళ్లు పంపగా 35,065 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. మరో 1851 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 724 మంది క్వారంటైన్లలో ఉన్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వచ్చిన వారికే పొజిటివ్ కేసులు నమోదు కావటంతో అధికారులు వారిని గుర్తించి ముందస్తుగా క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని 64 మంది డిశ్చార్జ్ అవగా, ప్రస్తుతం ఆస్పత్రిలో 24 మంది చికిత్స పొందుతున్నారు.
Updated Date - 2020-06-01T12:33:43+05:30 IST