ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ నుంచి తిరుమలకు వచ్చిన స్థానికుడికి కరోనా?

ABN, First Publish Date - 2020-04-01T04:18:58+05:30

పంజాబ్ నుంచి తిరుమలకు వచ్చిన స్థానికుడికి కరోనా లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: పంజాబ్ నుంచి తిరుమలకు వచ్చిన స్థానికుడికి కరోనా లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో అతనిని కుటుంబ సభ్యులు అశ్విని ఆస్పత్రికి తరలించారు. కరోనా లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షల కోసం తిరుపతి రుయాకు తరలించారు. 


కాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 44కు చేరాయి.  కొత్తగా మరో నాలుగు పాజిటివ్ కేసులను వైద్యులు గుర్తించారు. ఈ నలుగురు కూడా ఢిల్లీలో మతపరమైన ప్రార్ధనలకు హాజరై విశాఖకు వెళ్లినట్లు తెలిపారు. ఒక్క విశాఖలోనే ఇప్పటి వరకూ 10 పాజిటివ్ కేసులు నమోదైనట్లు చెప్పారు. 


అటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కరోనా వైరస్ అలజడి రేగింది.  ఢిల్లీకి ప్రార్థనలకు వెళ్లిన ముస్లింలు స్థానిక మసీదులో ఉన్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. గత కొద్ది రోజులుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 144  సెక్షన్ ఉండగా రోడ్డు మీదకు ఎలా వచ్చారంటూ స్థానికులతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. 


Updated Date - 2020-04-01T04:18:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising