ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంగోలు: రోడ్డు పక్కనే కరోనా కిట్లు!..

ABN, First Publish Date - 2020-08-03T20:00:34+05:30

ఏపీలో ఒకవైపు కరోనా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ఏపీలో ఒకవైపు కరోనా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో అధికారుల నిర్లక్ష్యం జనం ప్రాణాలమీదకు తెస్తోంది. ఒంగోలులో దేవుడు చెరువు పార్క్‌లో కరోనా పరీక్షలు నిర్వహించిన సిబ్బంది.. వారు ఉపయోగించిన కిట్లను అక్కడే పడేశారు. వైద్య సిబ్బంది తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంజీవని వాహనాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పిన అధికారులు.. ఇందుకు భిన్నంగా పార్క్‌లో పరీక్షలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


మరోవైపు ఒంగోలు పార్క్‌లో పరీక్షలు నిర్వహించిన 50 మందిలో 30 మందికి కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. అయితే వారిని అక్కడి నుంచి స్థానిక జీజీహెచ్‌కు తరలించేందుకు 108కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో దాదాపు 2 గంటలపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆటోలు కూడా ఎక్కించుకోకపోవడంతో కరోనా బాధితులు నడుచుకుంటూ వెళ్లి ఆస్పత్రిలో చేరారు. ఫోన్ చేసిన అరగంటలో 108 అంబులెన్స్‌లు అక్కడ ఉంటాయని ప్రకటించారేగానీ ఆచరణలో మాత్రం జరగడంలేదన్నారు.

Updated Date - 2020-08-03T20:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising