ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొమ్మదిగని కమ్మని మామిడి!

ABN, First Publish Date - 2020-04-01T09:22:24+05:30

మధురఫలం మామిడి నోటికి అందేనా? అష్టకష్టాలు పడి శ్రమకోర్చి పండించిన రైతాంగానికి పెట్టుబడులైనా దక్కేనా...ఈ ప్రశ్నలకు లేదనే జవాబు వస్తోంది. ఈఏడాది మామిడి రైతులకు లాభాల పంటే అనుకొనేలోపే కరోనా ప్రభావం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధురఫలం మామిడి నోటికి అందేనా? అష్టకష్టాలు పడి శ్రమకోర్చి పండించిన రైతాంగానికి పెట్టుబడులైనా దక్కేనా...ఈ ప్రశ్నలకు లేదనే జవాబు వస్తోంది. ఈఏడాది మామిడి రైతులకు లాభాల పంటే అనుకొనేలోపే కరోనా ప్రభావం విరగ్గాసిన మామిడి తోటలపై పడింది. కొమ్మల మీద మామిడిని చూసి నిన్నటిదాకా రైతులు మురిసిపోయారు. అయితే ఆ కాయలు ఆ కొమ్మలపైనే రాలిపోవాల్సిన పరిస్థితికి వారంతా కుమిలిపోతున్నారు! కోసే కూలీలు, మార్కెట్‌కు తరలించే వాహన డ్రైవర్లు అంతా లాక్‌డౌన్‌తో భౌతిక దూరం పాటిస్తుండటంతో తోటలో కాయలను దించే నాథుడే కరువయ్యాడు! సరిగ్గా  దిగుబడులు వస్తున్న సమయంలో కోతలు జరక్క తోటల్లో ఎక్కడికాయలు  అక్కడే  ఉండిపోయాయి.


పక్వానికి వచ్చినా అమ్ముకునే అవకాశం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.  రోజూ కోట్లరూపాయల మేర జరిగే వ్యాపారం ఒక్కసారిగా ఆగిపోవడంతో రైతులు, వ్యాపారులు  దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.  మామిడి ఎగుమతులకు నిబంధనలతో కూడిన అనుమతులిచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని  రైతాంగం, వ్యాపారులు ముక్తకంఠంతో కోరుతున్నారు.                     

-ఆగిరిపల్లి 


Updated Date - 2020-04-01T09:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising