ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నేపథ్యంలో టీటీడీ మరో నిర్ణయం.. రేపట్నుంచి..!

ABN, First Publish Date - 2020-03-27T13:55:25+05:30

ఇప్పటికే శ్రీవారి దర్శనాలను రద్దు చేసి ఘాట్‌రోడ్లను మూసేయగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం నుంచి సంగీత కార్యక్రమాలు రద్దు కానున్నట్టు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే శ్రీవారి దర్శనాలను రద్దు చేసి ఘాట్‌రోడ్లను మూసేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఇతర రాష్ట్రాల కళాకారులు నాదనీరాజనం వేదికపై కార్యక్రమాలు నిర్వహిం చాల్సి ఉన్నప్పటికీ రద్దు చేశారు.


అయితే.. నాదనీరాజనం వేదిక ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో ఐదు రోజులుగా జిల్లాకు చెందిన కళాకారులతోనే కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. తాజాగా 144  సెక్షన్‌ అమల్లో ఉండటంతో జిల్లాకు చెందిన వారూ తిరుమలకు చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గాత్ర కచేరి నిర్వహించి... శనివారం నుంచి కార్యక్రమాలను నిలిపివేయనున్నట్టు తెలిసింది. కాగా, గురువారం సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ఆస్థాన విద్యాంసుడు గురజాల మధుసూదనరావు అన్నమయ్య కీర్తనలను ఆలపించారు.

Updated Date - 2020-03-27T13:55:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising