ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ, మహారాష్ట్రలో ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా

ABN, First Publish Date - 2020-08-11T03:51:00+05:30

ఏపీ, మహారాష్ట్రలో కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది. రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్న ఏపీలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి/ముంబై: ఏపీ, మహారాష్ట్రలో కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది. రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్న ఏపీలో ఇవాళ 7,665 కేసులు నమోదయ్యాయి. 46,999 శాంపిల్స్‌ను పరీక్షించగా 7,665 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఏపీలో పెరిగింది. ఏపీలో గడచిన 24 గంటల్లో 6,924 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఏపీలో మరణాల సంఖ్య పెరగడం కొంత ఆందోళన కలిగించే విషయం.


ఏపీలో సోమవారం 80 మంది కరోనా వల్ల మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. జిల్లాల వారీగా కరోనా మరణాల ఈ విధంగా ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 11 మంది, గుంటూరులో 10 మంది, పశ్చిమగోదావరిలో 9 మంది, కడప 7, శ్రీకాకుళంలో 7, చిత్తూరులో 6, కర్నూలులో 6, అనంతపురంలో 5, నెల్లూరులో 5, విశాఖపట్నంలో 5, విజయనగరంలో 5, తూర్పుగోదావరిలో నలుగురు కరోనాతో మరణించారు. మహారాష్ట్రలో కూడా ఇవాళ కాస్త కేసులు తగ్గుముఖం పట్టాయి. మహారాష్ట్రలో 9,181 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఆదివారం 12,248 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఈ సంఖ్య కాస్త తగ్గడం గమనార్హం.





Updated Date - 2020-08-11T03:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising