ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా అనుమానంతో వెలి!

ABN, First Publish Date - 2020-04-03T09:18:34+05:30

కరోనా అనుమానంతో వెలి!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమాన్‌ జంక్షన్‌, ఏప్రిల్‌ 2: కరోనా సోకి ఉండవచ్చన్న అనుమానంతో ఓ వృద్ధుడిని కట్టుకున్న భార్య, కన్న కొడుకు ఇంటి నుంచి వెలివేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్‌జంక్షన్‌లో గురువారం ఈ దారుణం వెలుగు చూసింది. హనుమాన్‌జంక్షన్‌కు చెందిన వృద్ధుడు విజయవాడలోని ఓ కార్యాలయం వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రవాణా సాధానాలు లేకపోవడంతో అక్కడే ఉండి రెండు మూడు రోజులకోసారి ఇంటికి వస్తున్నాడు. విజయవాడ ప్రాంతంలో కరోనా వైరస్‌ ప్రబలడంతో బుధవారం సాయంత్రం ఇంటికి చేరిన అతడ్ని కుటుంబ సభ్యులు.. వైరస్‌ అనుమానంతో ఇంటిలోకి అడుగు పెట్టనీయలేదు. భార్య, కొడుకు కూడా అభ్యంతరం పెట్టారు. దిక్కుతోచని స్థితిలో వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు.  


కరోనా నుంచి కాపాడు గంగమ్మా!

కరోనా వైరస్‌ కబళిస్తున్న వేళ ఆ మహమ్మారి నుంచి మానవాళిని కాపాడు తల్లీ.. అంటూ మత్స్యకారులు గంగమ్మతల్లికి పూజలు చేశారు. కరోనాను తరిమికొట్టాలని కోరుతూ.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం వాసులు గురువారం సముద్రతీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బతుకుతెరువు కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లిన మత్స్యకారులు క్షేమంగా స్వగ్రామాలకు చేరుకునేలా చూడాలని వేడుకున్నారు. - ఎచ్చెర్ల

Updated Date - 2020-04-03T09:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising