గుంటూరు: సెల్‌ఫోన్ల కంటైనర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ABN, First Publish Date - 2020-10-04T18:27:34+05:30
సెల్‌ఫోన్ల కంటైనర్ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా చేధించారు.
గుంటూరు: సెల్‌ఫోన్ల కంటైనర్ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా చేధించారు. లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ నుంచి సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. మహారాష్ట్రకు చెందిన కంజర భట్ ముఠా పనిగా పోలీసులు తేల్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిందితుల నుంచి 862 సెల్‌ఫోన్లు, రూ.4.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అలాగే మెదక్ జిల్లా చేగుంటలో మరో చోరీకి సంబంధించిన సొత్తు కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. రూ.2.36 కోట్ల విలువైన 1,826 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరానికి వినియోగించిన లారీ, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీలో 11 మంది ముఠా సభ్యులు పాల్గొన్నారని, ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. మరో 9 మంది నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
Updated Date - 2020-10-04T18:27:34+05:30 IST