వ్యూహం ప్రకారం ప్రభుత్వాలు నడవడం లేదు: గంగాధర్
ABN, First Publish Date - 2020-09-14T18:57:21+05:30
కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ విమర్శించారు.
విజయవాడ: కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధులు సక్రమంగా నిర్వహించడం లేదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ విమర్శించారు. వ్యూహం ప్రకారంగా ప్రభుత్వాలు నడవడం లేదన్నారు. కరోనా టెస్ట్‌కు సంబంధించి వైద్య పరికరాలు, సౌకర్యాలు సరిగాలేకపోవడం వలన కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతుందని ఆరోపించారు. ప్రభుత్వాలని ఎన్ని సార్లు మొత్తుకున్నా పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. వలస కూలీల విషయంలో కాంగ్రెస్ ముందుండి సహాయం చేసిందని చెప్పుకొచ్చారు. కరోనా కేసులు పెరిగిపోతున్నా, ప్రభుత్వాలు మాత్రం వాటి సంఖ్యలు తప్పుగా చూపిస్తున్నాయని ఆరోపించారు. పీపీఈ కిట్లు, కరోనా రక్షణ పరికరాల లోటుపాట్ల వలన డాక్టర్లు, వైద్య సేవలందించే వారు చనిపోతున్నారన్నారు. వైద్యులు ప్రశ్నిస్తే అవమానించిన బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. బెడ్లు లేవని ప్రైవేటు వైద్యులు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమస్యలపై పలు పార్టీ నేతలతో రేపు రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు గంగాధర్ తెలిపారు.
ఏఐసీసీ మెంబెర్ నరహరశెట్టి నరసింహారావు మాట్లాడుతూ... ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీలు అరికట్టే విషయంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలని మార్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడాలి కానీ వారి ప్రాణాలతో ఆడుకుంటున్నాయని మండిపడ్డారు.
ఏపీసీసీ హ్యూమన్ రైట్స్ సెల్ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ... జస్టిస్ జె కె మహేశ్వరీ ఏపీ హైకోర్టులో నాలుగు నెలల్లో హ్యూమన్ రైట్ కమిషన్‌ను అమలు చేయాలనీ గత ఏడాది అక్టోబర్ 30న ఆర్డర్ జారీ చేశారని చెప్పుకొచ్చారు. పాత్రికేయ, దళితులు, వైద్యులు మీద దాడులు పెరిగిపోతున్నాయన్నారు. కోర్ట్ నిర్ణయం ప్రకారం వెళతామన్న ప్రభుత్వం.. మానవ హక్కుల కమిషన్‌ని ఎందుకు నియమించడం లేదని ప్రశ్నించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో సీసీ కామెరాస్, హ్యూమన్ రైట్ డెస్క్ ఏర్పాటు చేయాలని రాజశేఖర్ డిమాండ్ చేశారు.
Updated Date - 2020-09-14T18:57:21+05:30 IST