ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాంతానికో న్యాయం ఉంటుందా?

ABN, First Publish Date - 2020-05-09T09:59:42+05:30

ప్రాంతానికో న్యాయం ఉంటుందా... ప్రభుత్వం చేసిన కుట్రలకు అన్ని విధాల నష్టపోయి, అమరావతి కోసం పోరాడుతుంటే మాపైన హత్యాయత్నం కేసులు, అన్యాయంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ మీద పిక్‌ పాకెటింగ్‌ కేసులు పెడతారా అంటూ రైతులు నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

143వ రోజు కొనసాగిన

అమరావతి రైతుల ఆందోళనలు


గుంటూరు, మే 8(ఆంధ్రజ్యోతి): ప్రాంతానికో న్యాయం ఉంటుందా... ప్రభుత్వం చేసిన కుట్రలకు అన్ని విధాల నష్టపోయి, అమరావతి కోసం పోరాడుతుంటే మాపైన హత్యాయత్నం కేసులు, అన్యాయంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ మీద పిక్‌ పాకెటింగ్‌ కేసులు పెడతారా అంటూ రైతులు నిలదీశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారానికి 143వ రోజుకు చేరాయి. లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా రైతులు, మహిళలు, కూలీలు ఎవరి ఇంట్లో వారే కూర్చొని  వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు.


అందులో భాగంగా విశాఖలో గురువారం జరిగిన గ్యాస్‌ లీకేజీ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించారు. అలానే అస్వస్థతకు గురైన వారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. 29 గ్రామాల రైతులు రాజధాని విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం బడేపురం, పొన్నెకలు, మోతడక తదితర గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. 

Updated Date - 2020-05-09T09:59:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising