ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం శ్రీశైలం పర్యటన రద్దు

ABN, First Publish Date - 2020-08-22T09:03:40+05:30

రద నీటితో కళకళలాడుతున్న కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయం వద్ద శుక్రవారం పర్యటించి, పూజలు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి/కర్నూలు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): వరద నీటితో కళకళలాడుతున్న కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయం వద్ద శుక్రవారం పర్యటించి, పూజలు నిర్వహించాలని భావించిన సీఎం జగన్‌ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తెలంగాణ పరిధిలోని శ్రీశైలం జలవిద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఈ మేరకు నిర్ణయించినట్టు సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీశైలం జలాశయంలోకి వరుసగా రెండో ఏడాది భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు నిండింది. దీంతో.. సీమ జిల్లాలు సహా.. నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం శ్రీశైలం జలాశయం వద్ద పూజలు నిర్వహించాలని సీఎం జగన్‌ భావించారు. కాగా, శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించడంపై సీఎం జగన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తెలంగాణకు ఎలాంటి సాయం కావాలన్నా చేయాలన్నారు. 


వైఎ్‌సఆర్‌ ఆసరా అమలుకు ఉత్తర్వులు

డ్వాక్రా రుణాలు తీసుకున్న పట్టణ, గ్రామీణ స్వయం సహాయక బృంద సభ్యులకు నవరత్నాల్లో భాగంగా వైఎ్‌సఆర్‌ ఆసరా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2019 ఏప్రిల్‌ 11కు ముందు పొదుపు సంఘాలు తీసుకున్న రుణాలను ప్రభుత్వమే నాలుగు విడతలుగా వారికి చెల్లించేందుకు ఆదేశాలిచ్చింది. 


ఏఎన్‌ఎం పరిధిలోకి ఆరోగ్యశ్రీ సేవలు

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఏఎన్‌ఎంల విఽధులకు సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రస్తుత విధులతోపాటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన బాధ్యతలు కూడా వారికి అప్పగించింది. ఈమేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-08-22T09:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising